Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా (Maha Kumbh Mela) జనవరి 13 నుంచి ప్రారంభమైంది. ఈ మహా కుంభమేళాకు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తుల పవిత్ర స్నానం (Pavitra Snanam) ఆచరిస్తున్నారు. ఈ మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) స్నానం చేయడం వల్ల సకల పాపాలు అన్ని కూడా తొలగిపోయి.. మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్తున్నారు. సాధారణంగా కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే ఈ మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే మహా కుంభమేళాలో కొన్ని అమృత (Amruth Snanam) స్నానాలు ఉన్నాయి. మొదటి అమృత స్నానాన్ని ఈ రోజే ఆచరించారు. మకర సంక్రాంతి (Makara Sankranti) శుభ సందర్భంగా నాగ సాధువులు, సాదువులు మొదట ఈ అమృత స్నానం చేస్తారు. మహా కుంభమేళాలో ఈ అమృత స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజున స్నానం చేయడం వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఎన్నో కష్టాలు, పాపాల నుంచి విముక్తి చెందుతారని పండితులు అంటున్నారు. అయితే మహా కుంభమేళాలో ఉన్న ఆ అమృత స్నానాలు ఏంటి? ఏయే రోజుల్లో ఏ అమృత స్నానాలు ఆచరిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొదటి అమృత స్నానం
ఈ మొదటి అమృత స్నానాన్ని నేడు ఆచరించారు. ఇందులో నాగ సాదువులు మొదటిగా పవిత్ర స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
రెండవ అమృత స్నానం
మహా కుంభంమేళాలో రెండవ అమృత స్నానం జనవరి 29న నిర్వహిస్తారు. మౌని అమావాస్య నాడు ఈ రెండవ అమృత స్నానం నిర్వహించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. హిందూ మతంలో మౌని అమావాస్యకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య నాడు స్నానం చేసి, దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది.
మూడవ అమృత స్నానం
మహా కుంభ మేళాలో మూడవ అమృత స్నానం ఫిబ్రవరి 3న నిర్వహిస్తారు. ఈ రోజున వసంత పంచమి కావడంతో ప్రత్యేకంగా భావిస్తారు. పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, పూజలు నిర్వహించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే వసంత పంచమి నాడు జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధిస్తారు.
అమృత స్నానం ఎవరు ముందు చేస్తారంటే?
అమృత స్నానం సమయంలో ముందుగా నాగ సాధువులు ఆచరిస్తారు. ఆ తర్వాత ఇతర ప్రముఖులు, ఋషులు, స్నానం చేస్తారు. నాగ సాధువులు స్నానం చేసిన తర్వాత మిగతా వారు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. లేకపోతే కుంభమేళా ప్రతిఫలం దక్కదని చెప్పుకుంటారు. అయితే ఈ గంగా స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ వంటివి ఉపయోగించకూడదు. ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన తర్వాత తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేదలకు డబ్బు, బట్టలు, ఆహారం వంటివి దానం చేయాలి. అప్పుడే ప్రతిఫలం అందుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.