Maha kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ (Prayagraj), హరిద్వార్ (Haridwar), ఉజ్జయిని (Ujjayini), నాసిక్‌లో(Nasik) జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. ఇందులో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే మహా కుంభమేళాలో భక్తులు స్నానం చేయడానికి ఎన్నో ఘాట్‌లు ఉన్నాయి. ఒక్కోరు ఒక్కో ఘాట్ దగ్గర స్నానాలు ఆచరిస్తుంటారు. అయితే మహా కుంభమేళాలో ఎన్ని ఘాట్‌లు ఉన్నాయి. అయితే ఒక్కో ఘాట్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. మరి వాటి విశేషాలేంటి? అసలు ఏ ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించాలి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంగం ఘాట్
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఉన్న ప్రధాన ఘాట్‌లలో సంగం ఘాట్ ఒకటి. ఇది మూడు పవిత్ర నదుల సంగమాన్ని సూచిస్తుంది. అందుకే ఆ ఘాట్ దగ్గర స్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే.. మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం.
కేదార్ ఘాట్
ఈ ఘాట్ శివునికి ప్రత్యేకమైనది. ఇక్కడ శివుని ప్రార్థించి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
హండీ ఫోడ్ ఘాట్
ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఘాట్‌లలో హండీ ఫోడ్ ఘాట్ ఒకటి. ఈ ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ఘాట్‌కి ఎక్కువగా భక్తులు వెళ్తుంటారు.
దశాశ్వమేధ ఘాట్
అత్యంత పవిత్రమైన ఘాట్‌లో దశాశ్వమేధ ఘాట్ ఒకటి. పురాణాల ప్రకారం ఇక్కడ బ్రహ్మ 10 అశ్వమేధ యజ్ఞాలు చేసాడని చెప్పుకుంటారు. మహా కుంభమేళా సమయంలో ఇక్కడ గంగా ఆరతి వంటివి ఇస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.