JAILER 2 – Announcement Teaser : రజినీకాంత్ చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తు ముందుకు సాగుతున్నాయి…ఇక అందులో భాగంగానే ఆయన 2023 వ సంవత్సరంలో చేసిన ‘జైలర్ ‘ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ సినిమాకి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక మరోసారి ఆయన నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ సినిమాకి సీక్వేల్ గా జైలర్ 2 అనే సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ‘జైలర్ 2’ టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోని చాలా క్రియేటివ్ గా చేశారు…ఈ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ గోవాకి వెళ్ళి రిలాక్స్ అవుతున్న క్రమంలో వల్ల వెనకాల నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యం లో ఒక పెద్ద సైక్లోన్ అయితే రాబోతుంది అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది… దాంతో అనిరుధ్ నెల్సన్ తో సైక్లోన్ రాబోతుంది మన ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటాడు. దాంతో వైజాగ్ లో సైక్లోన్ వస్తుంది కాబట్టే నిన్ను గోవాకి తీసుకొచ్చానని నెల్సన్ చెబుతాడు. మరి టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోని ఎలా చేద్దాం అనే డిస్కషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు కొంతమంది రౌడీలు పరిగెడుతూ నెల్సన్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి కత్తులతో చంపబడతారు.
ఆ కత్తులు మాత్రమే కనిపిస్తాయి కానీ అవి పంపించే మనిషి ఎవరో కనిపించడు. దాంతో వీళ్ళు వెళ్లి పక్కన దాక్కుంటారు. ఇక అప్పుడే రజనీకాంత్ వచ్చి రౌడీలంతా ఎటు వెళ్లారు అని అడుగుతాడు. దాంతో నెల్సన్, అనిరుధ్ కలిసి అటు వెళ్లారని చూపిస్తారు. ఇక అప్పుడు రజినీకాంత్ ఆ ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ చేసి ముందుకు కదులుతాడు.
దాంతో ఎదురుగా ఉన్న గోడల నుంచి కొంతమంది గన్స్ తీసుకొని రావడంతో వాళ్ల మీద పెద్ద బాంబులు అయితే పడతాయి. దాంతో రజినీకాంత్ కి ఎదురుగా ఉన్న వ్యక్తులు అంతమైపోతారు. ఇక అప్పుడు రజనీకాంత్ తిరిగి స్పెక్ట్స్ పెట్టుకోవడంతో జైలర్ 2 టైటిల్ రివిల్ అవుతుంది. ఇదంతా చాలా పకడ్బందీ ప్రణాళికతో చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించారు. ఇక ఈ మొత్తం వీడియోలో రజినీకాంత్ కండ్లల్లో కనిపించే రాజసం హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.
ఈ ఏజ్ లో కూడా ఆయన కండల్లో ఉన్న ఆ ఫైర్ అయితే తగ్గడం లేదు. ఒక్కసారి ఆయన స్పెక్ట్స్ పెట్టుకోవడంతో ఆ స్టైల్ మరోసారి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. మరి టీజర్ అనౌన్స్మెంట్ వీడియోనే ఇలా ఉంటే ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల అంచనాలకే వదిలేసినట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాతో రజనీకాంత్ భారీ సక్సెస్ ని సాధించబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…