Jaggi Vasudev : సమాజంలో పేరుపొందిన వ్యక్తిగా.. విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా సద్గురు జగ్గీ వాసుదేవ్ కు పేరుంది. అయితే ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో ఇషా యోగా సెంటర్ లో పోలీసులు విశితంగా తానిఖీలు చేస్తున్నారు. తమ కుమార్తెలను ఇబ్బంది పెట్టి.. వారి లో లేనిపోని భయాలను సృష్టించి పెళ్లి చేసుకోకుండా.. సన్యాసులుగా మార్చారని ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.. దీని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆ ఇద్దరు యువతులను విచారించింది. అయితే వారు తమ సమ్మతం ప్రకారమే సన్యాసులుగా మారామని కోర్టు ఎదుట వివరించారు. అయితే వారు చెప్పిన సమాధానాలు కోర్టుకు ఎందుకో నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో ఈ వ్యవహారంపై సోదాలు జరిపి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. ఈ క్రమంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెలకు పెళ్లి చేశారని.. కానీ ఇతర తల్లిదండ్రుల కుమార్తెలకు పెళ్లిళ్లు వద్దంటున్నారని.. వారిని ఎందుకు సన్యాసం లోకి తీసుకెళ్తున్నారని కోర్టు ఆక్షేపించింది.. ఈ వ్యవహారం నేపథ్యంలో పోలీసులు ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈషా ఫౌండేషన్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చినప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇప్పటికీ చిదంబర రహస్యమే. అయినప్పటికీ అటువైపుగా పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు వెళ్లిన ఉదంతాలు లేవు. కానీ తొలిసారిగా చెన్నై హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈషా ఫౌండేషన్ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ సోదాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఈశా ఫౌండేషన్ కార్యాలయం స్పందించింది. తమ ఎవరిని కూడా పెళ్లి చేసుకోవాలని కాని.. సన్యాసం తీసుకోవాలని కాని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఈశా ఫౌండేషన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. చాలామంది ఆ ఫౌండేషన్ కు మద్దతుగా వస్తున్నారు. ఇక ఆశ్రమంలో ఉన్న వారు కూడా ఈషా ఫౌండేషన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. జగ్గీ వాసుదేవ్ ను దేవుడు అని కొనియాడుతున్నారు.
గతంలో కల్కి భగవాన్ ఆశ్రమంలో..
గతంలో కల్కి భగవాన్ ఆశ్రమంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఆశ్రమంలో ఉన్నవారు పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి సమాధానాలు చెప్పారు. చూడబోతే ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలు సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫౌండేషన్ కార్యాలయంలో రకరకాల యోగాలు, ఇతర అభ్యసన ప్రక్రియల గురించి మాత్రమే చెబుతున్నారని అక్కడ ఉండే వారు అంటున్నారు. అయితే అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు పోలీసులు అక్కడ సోదాలు చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు అనుకున్నట్టుగా అక్కడ ఏదైనా దొరికితే.. జగ్గీ వాసుదేవ్ పై కచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది.