Diwali Celebrations : దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. దీపానికి హిందూ సంస్కృతిలో అత్యంత ప్రధాన్యం ఉంటుంది. మనం రోజూ దేవుడికి దీపారాధన చేస్తారు. పూజలో దీపారాధనే అత్యంత కీలకం. ఇక హిందువులు దీపారాధన కోసం వివిధ రకాల ప్రమిదలను వాడుతుంటారు. అయితే ప్రమిదల ఆధారంగా ఫలితం కూడా ఉంటుందని అంటున్నారు పండితులు. దీపావళి సందర్భంగా దీపావళి నుంచి కార్తీక మాసం వరకు చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. ఏ ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందోతెలుసుకుందాం..
ఇత్తడి…
హిందువుల్లో చాలా మంది ఇత్తడి ప్రమిదలనే అనాదిగా ఉపయోగిస్తున్నారు. వీటిలో దీపం వెలిగిస్తే బంగారు ప్రమిదలో వెలిగించిన ఫలితం క లుగుతుందట. ఆయుష్షు పెరుగుతుందట.
కంచు..
కంచు ప్రమిదలు స్టీల్‌ను పోలి ఉంటాయి. వీటిలో దీపం వెలిగిస్తే రోగ బాధలు, అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
పంచ లోహాలు..
బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు కలిపిన మిశ్రమ లోహంతో చేసే ప్రమిదలను పంచలోహ ప్రమిదలు అంటారు. వీటిలో దీపారాధన చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి.
మట్టి ప్రమిదలు..
ఇక దీపావళి దీపారాధనకు చాలా మంది మట్టి ప్రమిదలనే వాడతారు. ఇవి అత్యంత శ్రేష్ఠమైనవి. వీటిలో నెయ్యి పోసి దీపం వెలిగిస్తే శుభ ఫలితం కలుగుతుంది.
పిండితో..
ఇక పిండితో చేసిన ప్రమిదలను కూడా దీపారాధనకు వాడతారు. బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదలు చేస్తారు. కార్తీక మాసంలో ఈ దీపాలనే శివారాధనకు వాడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు.
ఉసిరికాయ..
ఉసిరి దీపాలు కూడా కార్తీకమాసంలో ఎక్కువగా వెలిగిస్తారు. తులసికోట వద్ద ఉసిరి దీపాలతో ఆరాధన చేస్తారు. ఇలా చేస్తే నవగ్రహ దోషాలో పోతాయని నమ్ముతారు. ఉసిరి చెట్టు వద్ద కూడా దీపారాధన చేస్తే శుభం కలుగుతుంది.
వెండి...
కొందరు దేవుడి గదదిలో వెండి దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వలన సంపద వృద్ధి చెందుతుంది.
స్టీల్, ఇనుము..
ఇక స్టీలు, ఇనుము ప్రమిదల్లో దీపాలు వెలిగించొద్దని పండితులు చెబుతున్నారు. ఇవి అశుభానికి మాత్రమే వినియోగిస్తారని పేర్కొంటున్నారు. దేవుడి కోసం స్టీలు, ఇనుము ప్రమిదలు వాడకూడదని చెబుతున్నారు.