Ola Electric Scooter : కభారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. పెట్రోలు, డీజిల్ ధరల భారం తగ్గుతుందన్న కారణంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ ప్యాట్రన్ కు అనుగుణంగా.. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు డిమాండ్‌తో పాటు ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో పెద్ద వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తన సర్వీస్ సెంటర్ల సామర్థ్యాన్ని 30 శాతం పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 50కు పైగా సర్వీస్ సెంటర్స్, 500 మంది టెక్నీషియన్లను పెంచుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల కోసం తన కేంద్రాలను, శ్రామిక శక్తిని పెంచుకుంటోంది.
‘ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ సెంటర్ల సామార్థ్యాన్ని విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మా వద్ద వచ్చిన అనేక సర్వీసు బ్యాక్ లాక్‌లను ఇప్పటికే మేము పూర్తి చేశాం. మూడింట రెండొంతుల పెండింగ్ పనులు పూర్తయ్యాయి. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తాం. కస్టమర్ల సంతోషమే మాకు ముఖ్యం. వారికి మెరుగైన సేవలు అందించేందుకు మేం ఎల్లప్పుడూ ముందుంటాం’ అని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న టాస్క్‌లను క్లియర్ చేయడానికి కొత్త, ఇప్పటికే ఉన్న సర్వీస్ సెంటర్‌లలో 500 కంటే ఎక్కువ టెక్నీషియన్‌లను నియమించింది.
ఆటో మార్కెట్‌లో తన ఉనికిని పెంచుకోవడంలో భాగంగా ఓలా హైపర్ సర్వీస్ క్యాంపెయిన్‌ను గత సెప్టెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఈఏడాది డిసెంబర్ నాటికి సర్వీస్ సెంటర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని చూస్తున్నట్లు సీఈఓ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. 1,000కి పైగా సర్వీస్ సెంటర్లను పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటోకార్ప్,హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా ఓలాను అధిగమించలేకపోతున్నాయి.
ఇక దీపావళి పండుగ సీజన్ వేళ ఓలా ఎలక్ట్రిక్ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను తాజాగా ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను, అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి తరుణం. ఈ ఆఫర్ అస్సలు మిస్ కాకండి.