https://oktelugu.com/

Good Business Idea: మంచి బిజినెస్ ఐడియా : రూ. 500 కే ఫర్నిచర్ సహా సర్వం. త్వరపడండి

ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇంటికి కావాల్సిన ఫర్నీచర్ అమ్ముతారు వారు. మొత్తం కట్టెతో చేసినవే. ఉయ్యాల దగ్గర నుంచి బెడ్స్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 1, 2024 / 02:10 PM IST

    Good Business Idea Furniture for Rs. 500

    Follow us on

    Good Business Idea: ఇంట్లో ఫర్నీచర్ ఉంటే ఆ ఇంటి అందమే వేరు కదా. కానీ వామ్మో ఎక్కువ రేట్లు పెట్టి కొనడం కూడా భారమే. కానీ తక్కువ ధరలో దొరికితే ఎంత ఆనందం కదా. అయితే మీకు మంచి ధరలో ఫర్నీచర్ దొరికే ఓ మంచి ప్లేస్ చెబుతాము ఓ సారి తెలుసుకోండి. పెద్ద షాపింగ్ మాల్ కాదు అది.. కేవలం రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇంటికి కావాల్సిన ఫర్నీచర్ అమ్ముతారు వారు. మొత్తం కట్టెతో చేసినవే. ఉయ్యాల దగ్గర నుంచి బెడ్స్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్.

    అస్సాంకు చెందిన కుర్చీలు, బెడ్ లు ఇలా ప్రతి ఒక్కటి వీరు దిగుమతి చేసుకుంటారట. వీరు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? కరీంనగర్ సిటీ అవుట్ స్కర్ట్స్ లో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారట. అరమ్స్ కుర్చీలతో పాటు బాల్కనీ ఉయ్యాలల వరకు నైలాన్ దారంతో అల్లిన ఉయ్యాలలు కూడా వీరి దగ్గర లభిస్తాయి. రూ. 500 నుంచి రూ. 50000 వరకు ఇంటికి కావాల్సిన చాలా రకాల ఫర్నీచర్ వీరి దగ్గర మీకు లభిస్తుంది. తక్కువ ధరకు అమ్మినా వీరికి ఎంత లాభం వస్తుందో తెలుసా?

    ఖర్చులు మొత్తం పోగా నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారట. భార్యాభర్తలిద్దరూ కలిసి వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. వీరు కరీంనగర్ లోనే మూడు చోట్ల ఈ బిజినెస్ ను రన్ చేస్తున్నారట. చేతితో చేసినవి కాబట్టి చాలా మందికి నచ్చడంతో మంచి బిజినెస్ జరుగుతుందట. ఓ మంచి బిజినెస్ ఐడియా.. ఫర్నీచర్ ధర కూడా తక్కువే..