Homeఆధ్యాత్మికంJuly 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.....

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనున్నాయి. గురు గ్రహం, చంద్రగ్రహణం పరస్పరం తమ రాశులను మార్చుకునే స్థితిని రాశి పరివర్తనం అని అంటారు. వివాహం, సంతానం, అదృష్టానికి కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. భావోద్వేగం, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు చంద్రగ్రహాన్ని […]

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనున్నాయి. గురు గ్రహం, చంద్రగ్రహణం పరస్పరం తమ రాశులను మార్చుకునే స్థితిని రాశి పరివర్తనం అని అంటారు. వివాహం, సంతానం, అదృష్టానికి కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. భావోద్వేగం, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు చంద్రగ్రహాన్ని సూచిస్తారు. అయితే ఈ గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ఆ రాశులు ఏవో ఎప్పుడు చూద్దాం..

మేషం:
గురు, చంద్రులు తమ స్థానాలను మార్చుకోవడం ద్వారా మేషరాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి 26వ తేదీ నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ ప్రతిభను చూపడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

మిథునం:
ఈ రాశి వారికి ఈనెల మూడు తేదీల్లో అద్భుతమైన అవకాశాలు వరించనున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం ఏర్పరచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో కష్టపడతారు.

కన్య:
కన్య రాశి వారికి రెండు గ్రహాల మార్పులతో అదృష్టం వరించనుంది. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

తుల:
ఈ రాశి వారికి మూడు రోజులపాటు సానుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి. వ్యాపారులకు కొత్త సంబంధాలు ఏర్పడడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. చాలా విషయాల్లో వీరికి కలిసి వస్తుంది.

వృశ్చికం:
జూలై 20 ఆరు నుంచి వృశ్చిక రాశి వారికి అదృష్టం లక్కలా పట్టుకొనుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా.. దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొన్ని పనులు పూర్తి చేయడానికి ఓపికతో వ్యవహరించాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సులభం అవుతుంది.

మీనం:
ఈ రాశి వారు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. దీంతో కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper