Today June 21 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడునుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అదనపు ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశి ఉద్యోగుల జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త బాధ్యతలు చేపడతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు పెట్టుబడుల గురించి ఆలోచించాలి. కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఇన్నాళ్లు ఉన్న ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. నెట్వర్క్ ను ఉపయోగించుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కెరీర్ సంబంధించి త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ఆదాయవరణంలో సమకూరుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇవి విజయవంతంగా సాగే అవకాశం ఉంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు మహాశికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల పొదుపు మాత్రం నేర్చుకునే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి. తోబుట్టువులకు సంబంధించిన ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రాజెక్టును ప్రారంభించాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల ప్రశంసలు అందుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎవరికి అప్పు ఇవ్వడానికి ప్రయత్నించదు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణము ఉంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకువస్తాయి. వ్యాపారులు నష్టాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తారు. అదనపు లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరిగేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇవి విజయవంతంగా పూర్తి అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వీరికి అదనపు ఆదాయం సమకూరుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు వారసత్వంగా ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో ఎలాంటి రహస్యాలు పంచుకోకూడదు. కుటుంబంతో కలిసి చేసే వ్యాపారం అభివృద్ధి సాధిస్తుంది. ఉద్యోగులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభాలు ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఎవరికైనా ధ్రువపత్రాలు అందించే ముందు ఆలోచించాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా వహించాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం ప్లాన్ చేస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. కొన్ని శుభవార్తలు అందడంతో ఉల్లాసంగా కొనసాగిస్తారు. కొత్త వ్యాపారాన్ని జీవిత భాగస్వామితో కలిసి ప్రారంభిస్తారు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇది భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. అధికారులు అండదండలు ఉండడంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. బ్యాంకు నుంచి కావాల్సిన రుణం అందుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు.