https://oktelugu.com/

Karnataka : ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఇల్లు నిర్మించుకున్నట్లే.. ఈ క్షేత్రం ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?

ఇల్లు నిర్మించే ముందు వివాదాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇలాంటి వారు ఓ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల తమ సమస్యలను పరిష్కరించుకోగులుగుతారని చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు నిర్మించుకుంటారట. మరి ఆ క్షేత్రం ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్లాలి?

Written By:
  • Srinivas
  • , Updated On : October 3, 2024 4:48 pm
    Varaha Swamy Kshetra

    Varaha Swamy Kshetra

    Follow us on

    Karnataka :  సొంత ఇల్లు కట్టుకోవడం దాదాపు ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొందరు జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంటారు. ఇందుకోసం జీవితాంతం కష్టపడి డబ్బు కూడబెట్టుకొని ఆ తరువాత గృహాన్ని నిర్మించుకుంటారు. అయితే ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తుండడంతో చాలా మంది రుణ సాయంతో సొంతిల్లు నిర్మించుకుంటున్నారు. అయితే కొందరు ఇల్లు కడుతామని అనుకున్నా.. ఏదో ఒక కారణంతో అడ్డంకులు ఏర్పడుతాయి.. మరికొందరు ఇల్లు ప్రారంభించిన తరువాత పలు కారణాలతో మధ్యలోనే నిర్మాణం ఆగుతుంది. ఇంకొందరికి ఇల్లు నిర్మించే ముందు వివాదాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇలాంటి వారు ఓ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల తమ సమస్యలను పరిష్కరించుకోగులుగుతారని చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు నిర్మించుకుంటారట. మరి ఆ క్షేత్రం ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్లాలి?

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల్లో జాతక లోపం ఉన్నట్లే ఇల్లు కట్టుకోవడానికి కొన్ని ప్రతికూల శక్తులు అడ్డుగా నిలుస్తాయి. కొంత మంది వీటిని గుర్తించి వాటికి పరిహారంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. మరికొందరు శాంతి పూజలు చేస్తారు. అయితే ఇల్లు విషయంలో చాలా మంది బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద లక్ష్యం ఇల్లు నిర్మించడం డబ్బు ఉండడమే కాకుండా అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు ఉండాలి. అయినా కొందరికి ఏదో రకంగా ఇల్లు నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతాయి.

    ఇల్లు నిర్మించుకోవాలని అనుకునేవారికి ఎటువంటి అడ్డుంకులు ఏర్పడినా ఓ దేవాలయాన్ని సందర్శిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన వారు అంటున్నారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ జిల్లాలోని కేఆర్ పేటకు 18 కిలోమీటర్ల తరువాత కలహల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం హేమవతి అనే నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ భూ వరహా స్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో నారాయణుడు భూమాతతో కలిసి కొలువైనాడు.

    ఎటువంటి భూమి, ఇల్లు సమస్యలను పరిష్కరించే దేవుడిగా ఇక్కడి నారాయణులు పేరొందాడు. అందుకే ఈ స్వామిని భూ వరహా స్వామిగా పిలుస్తారు. ఎవరైనా ఇల్లు నిర్మించాలనుకున్నా.. ఎటువంటి ఇంటి, భూ సమస్యలు ఉన్నవారు ఇటుక పూజలు చేయాల్సి ఉంటుంది. రెండు ఇటుకలకు ఇక్కడ పూజలు నిర్వహించాలి. ఇందులో ఒకటి ఇక్కడే పెట్టి..మరొకటి ఇంటికి తీసుకెళ్లాలి. దానిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. అలాగే ఇల్లు నిర్మించుకునేవారు ఇంటిముందు దీనిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఇంటి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు.

    ఇల్లు నిర్మించే వారు ముందుగా ఇటుక పూజ చేయాల్సి ఉంటుంది. అలాటే ఇక్కడ ఇటుక పూజలు చేస్తారు. ఈ ఇటుకలను ఇంట్లో పెట్టిన కొన్ని రోజుల తరువాత ఇల్లు నిర్మించుకుంటారని చెబుతున్నారు. ఇక్కడికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు. అందువల్ల ప్రత్యేక వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. మాండ్య నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంటి నిర్మాణ సమస్యలు మాత్రమే కాకుండా భూ సమస్యలు, వివాదాలు, కోర్టు సమస్యలు ఉన్నవారు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల పరిష్కారం అవుతుందని అంటున్నారు.