T20 Women’s World Cup 2024 : ఇన్ని మైదానాలు ఉండగా.. యూఏఈనే ఎందుకు?, ఫార్మాట్ కు ఎందుకు మార్చారు? టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వెనక ఆసక్తికర సంగతులు..

మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా మహిళా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తర్వాత భారత జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఈ టోర్నీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..

Written By: Anabothula Bhaskar, Updated On : October 3, 2024 4:56 pm

T20 Women's World Cup 2024

Follow us on

T20 Women’s World Cup 2024 :  మహిళా టి20 వరల్డ్ కప్ ముందుగా బంగ్లాదేశ్ లో నిర్వహించాలని భావించారు. కానీ ఆ దేశంలో ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో అధికార మార్పిడి జరిగింది. ఈ క్రమంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. దీంతో అక్కడ టోర్నీ నిర్వహించడం కష్టమైన తరుణంలో ఐసీసీ బంగ్లాదేశ్ లో కాకుండా యూఏఈ లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ రెండు నెలల క్రితం నిర్వహించింది.. టోర్నీ యుఏఈ వేదికగా జరుగుతున్నప్పటికీ.. ఆతిధ్యహక్కులు మాత్రం బంగ్లా బోర్డుకే దక్కుతాయి.

ఫార్మాట్ మార్చారు

ఈ టోర్నీలో పది జట్లు పోటీ పడుతున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. లీగ్ దశ ముగిసే సమయానికి తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీస్ లో పోటీపడేందుకు అర్హత పొందుతాయి. గ్రూప్ – ఏ లో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్ – బీ లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.

హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా

ప్రస్తుత పురుషుల క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం అంతంతమాత్రంగా కొనసాగుతుండగా.. మహిళా జట్టులో మాత్రం ఆస్ట్రేలియాదే అప్పర్ హ్యాండ్. ఆరుసార్లు ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈసారి కూడా హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా నేటి ఆల్ రౌండర్ ఎలీస్ ఫెర్రీ, అష్లీ గార్డ్ నర్, తాలియా మెక్ గ్రాత్, అలీసా హేలీ, బెత్ మూనీ, అనా బెల్ వంటి వారితో ఆస్ట్రేలియా బలంగా ఉంది. జట్టులో ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. తనది కాని రోజు తప్పితే ఆస్ట్రేలియా ఇతర జట్టుకు లొంగే అవకాశం కల్పించడం లేదు. ఒకవేళ గ్రూప్ ఎ నుంచి ఆస్ట్రేలియా సెమిస్ వెళ్తే.. రెండవ స్థానం మాత్రం భారత జట్టు దే కావచ్చు. ఒకవేళ భారత్ కప్ గెలవాలంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా జట్టును ఓడించాలి. అది జరగాలంటే అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇక అక్టోబర్ 4న భారత్ దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. అక్టోబర్ 6న పాకిస్తాన్ జట్టుతో దుబాయ్ వేదికగా పోటీపడుతుంది. అక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంక జట్టుతో ఆడుతుంది. అక్టోబర్ 13న షార్జా వేదికగా భారత్ ఆస్ట్రేలియా తో పోటీపడుతుంది.