https://oktelugu.com/

కర్పూరంతో ఇలా చేస్తే ఇంట్లో అన్నీ శుభాలే..

ఇంట్లో దోషం ఉందని తేలితే కర్పూరంతో పాటు లవంగం కలిపి కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల మంచి సువాసన రావడమే కాకుండా అదృష్టం వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 14, 2024 / 03:18 PM IST

    Camphor

    Follow us on

    పూజ గదిలో కర్పూరం కీలకంగా ఉంటుంది. పూజ పూర్తయిన తరువాత కర్పూరంతోనే హారతి ఇస్తారు. హారతి ఇవ్వడం వల్ల పూజ గది గాలి రిప్రెష్ అవుతుంది. అలాగే కర్పూరాన్ని పూజ గదిలో మాత్రమే కాకుండా ప్రతీ గదిలో మండించడం వల్ల అక్కడ ఉన్న కలుషితమైన గాలి స్వచ్ఛమైనదిగా మారుతుంది. అయితే కర్పూరంతో పాటు మరికొన్ని పదార్థాలను కలపవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కర్పూరాన్ని పూజ గదిలో కాకుండా ఇతర ప్రదేశాల్లో కాల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

    హిందూ శాస్త్రం ప్రకారం కర్పూరానికి ప్రత్యేకత ఉంది. కర్పూరాన్ని పూజ గదిలో మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు రాత్రి కర్పూరం మండించడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జి వస్తుంది. అంతేకాకుండా గాలిలో ఉండే కాలుష్యం మాయమవుతుంది.

    ఇంట్లో దోషం ఉందని తేలితే కర్పూరంతో పాటు లవంగం కలిపి కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల మంచి సువాసన రావడమే కాకుండా అదృష్టం వస్తుంది. దీంతో ఇంట్లో ధనం వచ్చి చేరుతుంది. ఆర్థిక సమస్యలు మాయమవుతాయి. ఇక కర్పూరం వెదజల్లే సువాసన వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మెదడులో కొత్త ఆలోచనలు పెరుగుతాయి.

    కర్పూరంతో బిర్యానీ ఆకు కాల్చడం వల్ల ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో వాతావరణం మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.