PM Modi: దేశంలో లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి విపక్ష ఇండియా కూటమి మోదీ టార్గెట్‌గా ఓ నినాదం అందుకుంది. మోదీ అహంకారి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో కొంత పనిచేసినట్లే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. బీజేపీ బలం తగ్గడం, ఎన్డీఏ పుంజుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే బీజేపీ మోదీ నినాదాన్ని ఇండియా కూటమి అహంకారి అన్న నినాదం డామినేషన్ చేయడంతోనే ఫలితాలు ఇలా వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజంగా అహంకారా..
పదేళ్లు అధికారంలో ఉన్నందున మోదీ అహంకారి అన్న వాదనను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే మోదీ నిజంగా అహంకారా అంటే.. చాలా మంది కాదనే అంటున్నారు. అహంకారి అయితే.. గతంలో తమతో ఉండి పార్టీని వీడిన వారితో మళ్లీ కలిసేవాడు కాదని పేర్కొంటున్నారు. గతంలో నితీశ్‌కుమార్, చంద్రబాబునాయుడు, కుమారస్వామి, ఆర్‌ఎల్‌డీ తదితర పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. తర్వాత విభేదించి బయటకు వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ ఈ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాయి. నిజమంగా మోదీ అహంకారి అయితే.. ఈపార్టీలను దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అహంకారి అంటే కేసీఆర్..
అహంకారికి సరైన ఉదాహరణ కేసీఆర్ అని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. తనతో పెట్టుకున్న నేతలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడంలో ఆయన దిట్ట. ఆలె నరేంద్ర, విజయశాంతి, రఘునందన్‌రావు, దాసోజు శ్రవణ్, ఈటల రాజేందర్ ఇలా ఎంతో మందిని కేసీఆర్ అణచివేయాలని చూశారు. ఒక్క ఈటల రాజేందర్ మాత్రమే ప్రస్తుతం నిలదొక్కుకున్నారు. మిగతా వారంతా కనుమరుగయ్యారు. కేసీఆర్ ఆయన కుంటుంబం అహంకారంతో విర్రవీగుతుందని నమ్మిన తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దించారని పేర్కొంటున్నారు.
మోదీకి అండగా నిలిచిన దేశం..
ఇక మోదీకి దేశం అండగానే నిలిచింది. అహంకారి అని విపక్షాలు ఎంత ప్రచారం చేసిన దేశ ప్రజలు మోదీకి అండగా నిలిచారు. విపక్షాల నినాదాన్ని కొంత వరకే నమ్మారు. అందుకే బీజేపీకి కాస్త సీట్లు తగ్గినా అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు కేంద్రంలో మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొంటున్నారు.