AP Cabinet: డిప్యూటీ సీఎంతోపాటు పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు.. హోంశాఖ ఎవరికంటే?*

పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదాను కట్టబెడుతూ కీలక మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక క్యాబినెట్లో సీఎం తర్వాత.. అత్యంత కీలకంగా భావించే హోం శాఖను వంగలపూడి అనితకు అప్పగించారు. నారా లోకేష్ కు ఐటి, హెచ్ ఆర్ డి, ఆర్ జి టి శాఖలను కేటాయించారు.

Written By: Dharma, Updated On : June 14, 2024 3:21 pm

AP Cabinet

Follow us on

AP Cabinet: ఏపీలో కీలక అప్డేట్. మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు జాబితాను విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే సీఎం చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. కీలక ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఈరోజు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదాను కట్టబెడుతూ కీలక మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక క్యాబినెట్లో సీఎం తర్వాత.. అత్యంత కీలకంగా భావించే హోం శాఖను వంగలపూడి అనితకు అప్పగించారు. నారా లోకేష్ కు ఐటి, హెచ్ ఆర్ డి, ఆర్ జి టి శాఖలను కేటాయించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు వ్యవసాయ శాఖను దక్కించుకున్నారు. జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను సీఎం చంద్రబాబు తన వద్ద ఉంచుకున్నారు.

మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ.. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్.. కింజరాపు అచ్చెనాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ… కొల్లు రవీంద్ర కు గనులు, ఎక్సైజ్ శాఖ… నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ.. పొంగూరు నారాయణకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్.. వంగలపూడి అనితకు హోం శాఖ, విపత్తుల నిర్వహణ… సత్య కుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్.. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖ, ఎన్ఎండి ఫరూక్ కు న్యాయ, మైనారిటీ సంక్షేమం.. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ.. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు.. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు.. గొలుసు పార్థసారధికి గృహ నిర్మాణం, సమాచార శాఖ… డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ.. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ.. కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ.. గుమ్మడి సంధ్యారాణికి గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ.. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు.. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం.. ఎస్ సవితకు బీసీ సంక్షేమం, చేనేత, జౌళి.. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు, సర్ఫ్, ఎన్నారై వ్యవహారాలు.. మంది పల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన క్రీడల శాఖలను అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.