Diwali : దీపావళి రోజు మీ పెంపుడు కుక్కలు, పిల్లులను ఎలా సురక్షితంగా ఉంచాలి?

ఈ దీపావళికి పెంపుడు జంతువులు ఉన్న వారు వాటిని ఎలా రక్షించుకోవాలి అనే విషయాల పట్ల కాస్త చర్చించుకుందామా? మరి అయితే ఆలస్యం ఎందుకు చదివేసేయండి

Written By: Swathi Chilukuri, Updated On : October 31, 2024 5:40 pm

Diwali

Follow us on

Diwali :  ప్రజలు పటాకులు పేల్చడం లేదా వారి కుటుంబం, స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపుతుంటారు. అంటే పండుగను జరుపుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ దీపావళి కొన్నిసార్లు పెంపుడు జంతువులకు ఒత్తిడితో కూడిన సమయంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఈ దీపావళికి పెంపుడు జంతువులు ఉన్న వారు వాటిని ఎలా రక్షించుకోవాలి అనే విషయాల పట్ల కాస్త చర్చించుకుందామా? మరి అయితే ఆలస్యం ఎందుకు చదివేసేయండి.

ఇంటి లోపల సురక్షితమైన స్థల: మీ పెంపుడు జంతువు అకస్మాత్తుగా క్రాకర్లు పేలడం లేదా కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ శబ్దం వినిపిస్తూ ఉంటే అవి ఆందోళన చెందుతాయి. లేదా భయపడుతుంటాయి. ఇలా ఉండకుండా ఉండాలంటే పరుపులు, బొమ్మలు మొదలైన వాటితో హాయిగా వాటికి కాస్త స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన స్థలంలో ఉంచండి. స్థలాన్ని పెట్ ప్రూఫ్ చేయండి. సంతోషంగా పడుకుంటాయి.

ఇంటి లోపల: మీ పెంపుడు పిల్లి లేదా కుక్క ఇంటి లోపల ఉండేలా చూసుకోండి. ప్రత్యేకించి బాణాసంచా పేల్చే సమయంలో వాటిని అసలు బయటకు వెళ్లనివ్వకండి. లేదంటే ఆ శబ్దాలకు అవి ఎటు పరిగెడుతున్నాయో కూడా తెలియకుండా వెళ్తుంటాయి. సో మీ పెంపుడు జంతువులను ఇంటి లోపల ఉంచడమే బెటర్. ఇంట్లో ఉంచినా సరే శబ్దాలు ఎక్కువగా వినిపించకుండా తలుపులు, కిటికీలను మూసివేయండి. ఇంట్లో మంచి సాంగ్స్ ను ప్లే చేసి పెట్టండి. వాటికి కూల్ మ్యూజిక్ వింటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు బయట శబ్దాలు ఎక్కువగా వినిపించవు.

నూనె: పెంపుడు జంతువులకు సురక్షితమైన ముఖ్యమైన నూనెలు, ప్లగ్-ఇన్ ఫెరోమోన్‌లు కూడా పండుగల సమయంలో ఆత్రుతగా ఉన్న పెంపుడు జంతువులను కూల్ చేస్తుంటాయి. అంతేకాదు మీ పెంపుడు జంతువును బయటి కార్యకలాపాలు, శబ్దాల నుంచి దృష్టి మరల్చకుండా ఉంచడానికి బొమ్మలు లేదా పజిల్ ఫీడర్‌లతో నిమగ్నం చేసి ఉంచడం బెటర్.

అలంకారాల విషయంలో జాగ్రత్త: కొవ్వొత్తులు, దీపాలు, కొన్ని పువ్వులు, స్వీట్లు, కొన్ని ఇండోర్ మొక్కలు వంటి వాటి నుంచి మీ పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి, ఎందుకంటే అవి వాటికి ప్రమాదకరం అని భావించి పాడు చేస్తాయి. కొన్ని నిజంగానే వాటికి ప్రమాదకరంగా మారుతుంటాయి. క్రాకర్స్, దీపాలు, కొవ్వొత్తుల పట్ల వాటికి అవగాహన ఉండదు కాబట్టి వాటి పక్కన వెళ్లి కూర్చొన్నా లేదా నిల్చున్నా సరే వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో జాగ్రత్త.

కట్టేయండి: కుదిరితే వాటిని బయటకు వెళ్లకుండా, ఇంట్లో ఎక్కడ తిరగకుండా కట్టేయడం బెటర్. లేదంటే వాటి రూమ్ లో వదిలేయడమే బెటర్. సమయానికి ఆ రోజు ఫుడ్ పెడుతూ వీలైతే అసలే వాటిని బయటకు రానివ్వకుండా చూడండి. ఆ రూమ్ లో ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు, లేదంటే అవి ఇష్టపడే వస్తువులు పెట్టండి. అప్పుడప్పుడు మీరు వెళ్లి చూడండి. కానీ బయట మాత్రం తిరిగేలా చేయవద్దు. లేదంటే ఈ రోజు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.