spot_img
Homeఎంటర్టైన్మెంట్Surya Viswanath And Sons Teaser Review: సూర్య 'విశ్వనాధ్ & సన్స్' టీజర్ రివ్యూ...

Surya Viswanath And Sons Teaser Review: సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్ రివ్యూ : కాన్సెప్ట్ అదిరింది..ఈసారి కం బ్యాక్ పక్కా!

Surya Viswanath And Sons Teaser Review: చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న తమిళ స్టార్ హీరో సూర్య(Surya Sivakumar), ‘లక్కీ భాస్కర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న వెంకీ అట్లూరి తో కలిసి చేసిన చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్'(Viswanath & Sons). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ మరియు ఫార్చ్యూన్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫైవ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. తెలుగు లో మొట్టమొదటి సూర్య చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా నేడు విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య నుండి ఎలాంటి సినిమా అయితే కోరుకున్నామో , అలాంటి సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. ఇక ఆయన కం బ్యాక్ లాంఛనమే అంటూ ఈ టీజర్ ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ టీజర్ విశేషాల్లోకి వెళ్తే , ఇందులో సూర్య పిస్టల్ ఛాంపియన్ గా నటిసున్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళ వయస్సు వచ్చినా , ఆయన యువతరం తో పోటీ పడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితం లోకి ఒక 20 ఏళ్ళ అమ్మాయి ప్రవేశించి, అతన్ని ప్రేమలో దింపుతోంది. ఒక 40 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి కి , 20 ఏళ్ళ వయస్సు ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగితే ఆ సంసారం ఎలా ఉంటుంది?, ఎలాంటి సవాళ్లు ఎదురు అవుతాయి అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా రాసాడు డైరెక్టర్. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అని అనిపిస్తోంది. నువ్వు చిటిక వేస్తె నీ వయస్సు అబ్బాయిలు ఎంతో మంది అబ్బాయిలు నీ వెంట పడుతారు అని సూర్య అనడం, నాలుగు సార్లు చిటిక వేసాను , నువ్వే నా వెంటపడు అని హీరోయిన్ అనడం ఈ టీజర్ లో హైలైట్ గా అనిపించింది.

మనం గొప్ప అనుకున్న ప్రతీ సారీ, మన కన్నా గొప్పవాడు ఒకడు ఉంటాడని దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు అనే డైలాగ్ కూడా బాగా పేలింది. ఇలా సినిమాలో విభిన్నమైన అంశంతో కూడిన స్టోరీ తో పాటు, మంచి స్క్రీన్ ప్లే కూడా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. జీవీ ప్రకాష్ కుమార్ చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాకు పని చేసాడు. ఓవరాల్ గా ఈ చిత్రం మంచి ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ స్టోరీ గా అనిపిస్తోంది . ఫ్యామిలీ ఎమోషన్స్ ని రక్తి కట్టించడం లో డైరెక్టర్ వెంకీ అట్లూరి సిద్ధహస్తుడు. ఈ సినిమాతో కూడా ఆ రేంజ్ ఫ్యామిలీ డ్రామా ని కచ్చితంగా క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నారు నెటిజెన్స్.

 

Vishwanath and Sons TEASER (Telugu) | Suriya, Mamitha Baiju | GV Prakash | Naga Vamsi | Venky Atluri

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version