Kiran Abbavaram’s ‘Ka’ movie : విడుదలైన మొదటి రోజే ఓటీటీ లోకి కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రం..చిన్న సినిమా అంటే ఇంత చులకనా!

'క' సినిమా ఓటీటీ, సాటిలైట్ రైట్స్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఈ చిత్రం థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ యాప్ భారీ ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకుందట.

Written By: Vicky, Updated On : October 31, 2024 7:02 pm

Kiran Abbavaram's 'Ka' movie

Follow us on

Kiran Abbavaram’s ‘Ka’ movie : నేడు దీపావళి కానుకగా విడుదలైన చిత్రాలలో మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘క’. విడుదలకు ముందు నుండే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ ప్రతీ ఒక్కటి కొత్త తరహా థియేట్రికల్ అనుభూతి ఇవ్వబోతున్న సినిమా అని ప్రేక్షకులకు, బయ్యర్స్ కి నమ్మకం వచ్చింది కాబట్టి. దానికి తోడు కిరణ్ అబ్బవరం మరియు మూవీ టీం చేసిన ప్రొమోషన్స్ కూడా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. ఆడియన్స్ కి ఆయన మాటలు మనసుకి బాగా హత్తుకున్నాయి. ఫలితంగా నేడు ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజే ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ, సాటిలైట్ రైట్స్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఈ చిత్రం థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ యాప్ భారీ ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకుందట. అదే విధంగా సాటిలైట్ రైట్స్ కూడా ఈటీవీ నే కొనుగోలు చేసింది. డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కలిపి 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. కిరణ్ అబ్బవరం చిత్రానికి విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ రావడం ఈ చిత్రానికే జరిగింది. 28 రోజుల తర్వాత ఈటీవీ విన్ యాప్ లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. అయితే ముందుగానే ఇలా ఓటీటీ విడుదల తేదీ బయటకి రావడం వల్ల థియేట్రికల్ రన్ పై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు భయపడుతున్నారు. ఇలాంటి విషయాలు బయటకి రాకుండా ఎంత గోప్యంగా ఉంచినా ఎలా బయటకి వస్తున్నాయో అర్థం కావడం లేదంటూ నిర్మాతలు వాపోతున్నారట. కేవలం ‘క’ విషయం లో మాత్రమే కాదు, ఇటీవలే విడుదలైన ప్రతీ చిత్రానికి ఇదే సమస్య.

దీనిపై ఎలా అయినా కఠినమైన యాక్షన్ తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రానుందని, కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆయన కెరీర్ హైయెస్ట్ వసూళ్లు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రానికి వచ్చింది. ఫుల్ రన్ లో ఈ సినిమాకి 7 కోట్ల రూపాయిలు రాగా, ‘క’ చిత్రానికి అందుకు రెండింతలు ఎక్కువ వసూళ్లు రానున్నాయి.