https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు చేసిన ఆ ప్లాప్ సినిమా చిరంజీవి దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరికీ నచ్చిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు చూడడానికే ప్రతి ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ సినిమాలైతేనే చాలా గ్రాండ్ గా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఉంటాయి. అలాగే కథ కూడా చాలా పెద్ద స్పాన్ తో ఉంటుంది కాబట్టి వాళ్ల సినిమాలు చూస్తే ప్రేక్షకుడు ఒక డిఫరెంట్ అనుభూతిని పొందుతారనే ఉద్దేశ్యంతో వాళ్ల సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 31, 2024 / 06:15 PM IST

    Mahesh Babu Movie

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఒకప్పుడు రైటర్ గా పెను సంచలనాలను సృష్టించిన ఈయన ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ సినిమాలను చేస్తూ వరుస విజయాలను అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించడంలో ఆయన చాలా వరకు బిజీగా ఉన్నాడు… ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు మాత్రం సినిమా బాగానే ఉంది ఎందుకు ఫ్లాప్ అయిందనే అనుమానాలను ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ సినిమాకి ప్రేక్షకులోనే కాకుండా సెలబ్రిటీ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందనే విషయాన్ని చెప్పడంలో మాత్రం అందరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు.

    మరి ఆ టైమ్ పిరియడ్ లో ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేదా? లేదంటే సినిమాలో కంటెంట్ ఏదైనా వీక్ గా ఉందా అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద ఎవరు చేసిన అనాలసిస్ అయినా అంత బాగా వర్కౌట్ కావడం లేదు.

    నిజానికి అన్ని క్రాప్ట్ లో వాళ్ళు బెస్ట్ ఔట్ పుట్ ను ఇచ్చినప్పటికి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.అయినప్పటికి ఆ తర్వాత టీవీల్లో ప్రేక్షకుల మన్ననలను పొందుతూ వస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అయితే ఈ సినిమాతోనే ఒక కొత్త కోణంలోకి వెళ్లిందనే చెప్పాలి.

    అప్పటిదాకా యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా నటించిన మహేష్ బాబు ఒక్కసారిగా తన పంథా ను మార్చుకొని ఈ సినిమాలో కామెడీని ఎక్కువగా పండించాడు. దానివల్లే ఈ సినిమా భారీగా ఎలివేట్ అవ్వడమే కాకుండా సూపర్ సక్సెస్ ని కూడా సాధిస్తుందని ప్రేక్షకులు అందరూ భావించారు. కానీ ఈ సినిమా థియేటర్లో మాత్రం పెద్దగా ఆడలేదు…