https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారిపై విష్ణు అనుగ్రహం దీంతో వీరికి ఈ రోజు అన్ని విజయాలే..

పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు తల్లిదండ్రుల సహాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2024 / 08:20 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: ద్వాదశ రాశులపై గురువారం మాఘ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి విష్ణు అనుగ్రహం ఉండడంతో వారు ఏ పని చేపట్టిన విజయమే అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మిగతా రాశుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

    మేష రాశి: ఈరోజు వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. వీటిని త్వరగా పరిష్కరించుకుంటే మంచిది. తల్లిదండ్రుల సహాయంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

    వృషభరాశి: ఈ రాశి వ్యాపారులకు కొత్త అవకాశాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం మహాలధంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఏ చిన్న అనారోగ్యానికి గురైన వైద్య సలహా తీసుకోవాలి.

    మిథున రాశి: పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు తల్లిదండ్రుల సహాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

    సింహా రాశి: విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో వ్యాపార అభివృద్ధిపై చర్చిస్తారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

    కన్యరాశి: కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహానికి ఆటంకం తొలిగిపోతుంది దీంతో కుటుంబంలో సంతోషం గా ఉంటుంది. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

    తుల రాశి: కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు వ్యాపారాలు అనుకోకుండా లాభాలు పొందుతారు విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. అయితే కొందరు చర్యల వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది.

    వృశ్చిక రాశి: ఉద్యోగులు కార్యాలయాల్లో సంయమనం పాటించాలి. సీనియర్ల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం. వ్యాపారాలు రిస్క్ తో కూడిన పనులు చేస్తారు. కానీ ఇవి లభిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.

    ధనస్సు రాశి: వ్యాపారం కొత్త ప్రణాళికలు వేస్తారు. దీంతో ఊహించని విధంగా లాభాలు ఉంటాయి ఉద్యోగంలో లక్ష్యం కోసం పనిచేస్తారు ఎంత ప్రశంసలు అందుతాయి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం అందువల్ల జాగ్రత్తగా ఉండాలి

    మకర రాశి: వ్యాపారులు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేయాలి నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా నష్టపోతారు. ఏదైనా ఆస్తిని అమ్మాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఊహించిన లాభాలు వచ్చే అవకాశం. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    కుంభ రాశి: శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆధి పత్యం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వాగ్వాదాలు ఏర్పడితే సమస్య పరిష్కరించుకోవాలి. దైవ దర్శనాల కోసం వియార యాత్రలు చేస్తారు.

    మీనరాశి: కుటుంబ ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి మద్దతు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.