https://oktelugu.com/

House : ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి? దాని ప్రయోజనం ఏమిటి?

మనం ప్రతిరోజు చేసే చాలా పనుల్లో ఎన్నో అర్థాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. సంప్రదాయాలను పాటించేవారు వారి పని వారు చేస్తుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 19, 2024 / 08:00 AM IST

    Muggu

    Follow us on

    House : మనం ప్రతిరోజు చేసే చాలా పనుల్లో ఎన్నో అర్థాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. సంప్రదాయాలను పాటించేవారు వారి పని వారు చేస్తుంటారు. కానీ తెలియకుండానే వారికి చాలా విషయాల్లో మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో నెగిటివ్ కూడా ఎదురు అవుతుంది. కానీ సంప్రదాయాల వెనుక మంచి రహస్యాలే ఎక్కువగా దాగి ఉన్నాయి. గడప మీద ముగ్గు వేయడం దగ్గర నుంచి బెడ్ రూమ్ లో కొన్ని దిశల్లో అద్దాలు ఉండకూడదు అనే వరకు ప్రతి విషయంలో కూడా ఒక అర్థం దాగి ఉంది. గడప మీద పసుపు వేసి అలంకరిస్తే లక్ష్మీ దేవికి ప్రీతి అంటారు. కానీ పసుపు రాయడం వల్ల ఎన్నో సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇదిలా ఉంటే బెడ్ రూమ్ లో అద్దం ఉండటం వల్ల ఆ అద్దంలో నుంచి భార్య భర్తలు లేదా ఎవరు పడుకున్నా సరే బయటి వారికి కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని దిశల్లో పెట్టకూడదు అంటారు.

    ప్రతి రోజు ఇంటి ముందు ఆవు/ గేదె పేడతో కళ్లాపి చల్లి దాని మీద ముగ్గు వేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇంకా సంక్రాంతికి అయితే ప్రతి వాకిలి కూడా ఎంత అందంగా ముస్తాబు అవుతుందో కదా. అబ్బ ఆ రంగురంగుల వాకిల్లు, పోటీ పడి మరీ వేసే మగువలు ఆ రోజు మొత్తం ఊరు అందంతో మెరిసిపోతుంటుంది. ఇక ప్రతి రోజు వాకిలి ఇదే అందంతో మంచి మంచి ముగ్గులతో ముస్తాబు అవుతుంది. కానీ రంగులు కాస్త తక్కువ అంతే. సాధారణంగా ఇంటి ముందు ముగ్గు పెట్టడం వెనకాల ఉన్నఅర్థం ఏంటి అంటే పెద్దలు లక్ష్మీ దేవిని ఇంట్లో కి ఆహ్వానించడం అంటారు.

    ఎన్నో తరాల నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. వారు మాత్రమే కాదు మనం కూడా పాటిస్తున్నాం కదా. ఇక ముగ్గు వేయడం పూజలకు చాలా ముఖ్యం కదా. పూజలు, పండగలతో సంబంధం లేకుండా ఈ ముగ్గులు వాకిట్లో వెలిగిపోతుంటాయి. ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంటికి శుభం జరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ కాలంలో చలి మరింత ఎక్కువ ఉన్నా సరే సమయానికి ఉదయమే లేచి కలాపి చల్లి ముగ్గు పెట్టడం మగువల కర్తవ్యం అన్నట్టుగా చేస్తారు. అదే వారికి కూడా అందం కదా.

    ముగ్గు వేయాలనే భయంతో ఉదయమే లేవాలి. అంటే ఉదయం లేవడం వల్ల మనసు, మెదడు రెండూ చురుకుగా ఉంటాయి. బియ్యపు పిండి తో ముగ్గు వేస్తే చీమలకు మంచి ఆహారం పెట్టినట్టు. తెలియకుండా చీమలు తొక్కి చంపితే దీని వల్ల కలిగే అనర్ధాల నుంచి పిండి పెట్టి తొలగించినట్టు అవుతుంది. మీ అనర్థాలు కూడా తొలిగిపోతాయి. తెల్లవారు జామున కన్యలు నిద్ర లేచి పనులు చేయడం వల్ల ఆ ఇంటికి ఎంతో అందం వస్తుంది. అలాంటి ఇల్లు ఆయురారోగ్యాలతో ఉంటుంది.

    కొందరు మామూలు ముగ్గు వేస్తారు. మరికొందరు మెలికల ముగ్గులు వేస్తారు. అయితే ఈ మెలికల ముగ్గుల వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయట. మెలికల ముగ్గులు వేయాలంటే మొత్తం గుర్తు పెట్టుకోవాలి. అంటే జ్నాపకశక్తి ఉండాలి, ఇలా కంటిన్యూ చూస్తే మెదడు కూడా షార్ప్ అవుతుంది. మహిళలకు శారీరక బలం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.