Horoscope Today: గ్రహాల మార్పు తో కొన్ని రాశుల్లో అనుకోని మార్పులు జరగనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు రవి యోగం తో పాటు సిద్ధయోగం ఏర్పడనుంది. దీంతో కర్కాటకం తో సహా కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీరం వరకు 12 రాశుల మొత్తం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టబడులు పెడతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కొందరి వ్యక్తుల నుంచి డబ్బులు రుణంగా తీసుకుంటారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
వృషభరాశి: ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయితే సమస్య పరిష్కారానికి వెంటనే ప్రయత్నించాలి. లేకుంటే దంపతుల మధ్య దూరం పెరిగే అవకాశం. వ్యాపారులు, ఉద్యోగులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు.
మిథున రాశి: కొన్ని విషయాల్లో అసౌకర్యంగా ఉంటారు. అయితే శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తులో కొన్ని అవసరాల కోసం డబ్బులు కూడా పెడతారు.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తల్లికి ఏదైనా ఆరారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. విలాసాల కోసం అదనంగా ఖర్చులు ఉంటాయి. అయితే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యయం చేయాలి.
సింహా రాశి: వ్యాపారంలో నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని నష్టాలు చేకూర్చే వాటికి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహాయంతో వివాహ ప్రయత్నాలు సాగుతాయి.
కన్యరాశి: తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులు కొత్త పెట్టబడులను పెడుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజుతో పూర్తవుతాయి.
తుల రాశి: కొత్తగా వ్యాపారంలో చేరే వారికి ఇది అనుకూల సమయం అని అనుకోవద్దు. కొంతకాలం వెయిట్ చేయడం మంచిది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో విభేదాలు ఉంటాయి. ఈ సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి: వ్యాపారులు అనుకోకుండా ఈరోజు ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంతుంది.
ధనస్సు రాశి: అనుకోకుండా అదృష్టం వరించి ధన లాభం వస్తుంది. సాయంత్రం అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి: అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులను పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ధన సహాయ అందుతుంది.
కుంభ రాశి: తెలివితేటలతో కొన్ని పనులు చాలా చక్కగా పూర్తవుతాయి. అయితే కొందరి దగ్గర బంధువులే మోసం చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి: ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతారు. స్నేహితుల తో సరదాగా ఉంటారు. బంధువుల ఇళ్లల్లోకి వెళ్లి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.