Mohan Babu: విలక్షణ నటుడు మోహన్ బాబు కి ఇద్దరు కుమారులన్న సంగతి తెలిసిందే. చిన్న కొడుకు మనోజ్ తో ఆయనకు విబేధాలు ఉన్నాయన్న వాదన చాలా కాలంగా ఉంది. మనోజ్ గతంలో ఇంటిని వీడి వెళ్ళిపోయాడు. మోహన్ బాబుతో కలిసి ఉండటం లేదని వార్తలు వచ్చాయి. అనంతరం భూమా మౌనికతో మనోజ్ కనిపించాడు. రిలేషన్ లో ఉన్న మౌనిక-మనోజ్ 2023 మార్చి నెలలో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళికి మంచు లక్ష్మి పెద్దగా వ్యవహరించింది. ఆమె ఇంట్లోనే పెళ్లి జరిగింది.
మోహన్ బాబు, విష్ణు మొక్కుబడిగా ఈ పెళ్లికి హాజరయ్యారు. విష్ణు అయితే.. అలా వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. మోహన్ బాబు పిల్లలు విష్ణు ఒకవైపు మనోజ్, మంచు లక్ష్మి మరొకవైపు చేరారు. విష్ణును వారిద్దరూ కలవడం లేదు. మంచు లక్ష్మి హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. మౌనికతో పెళ్లి జరిగిన రోజుల వ్యవధిలో విష్ణు తనపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఒక వీడియో బయట పెట్టారు. ఆ వీడియోలో విష్ణు కోపంగా ఉన్నారు. ఆయన్ని గొడవ వద్దని ఎవరో వారిస్తున్నారు. ఆ వీడియోను మనోజ్ సోషల్ మీడియా నుండి వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అది వైరల్ అయ్యింది.
డిసెంబర్ 8న మనోజ్-మోహన్ బాబు పరస్పరం దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారన్న న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని కథనాలు వెలువడ్డాయి. మోహన్ బాబు టీమ్ ఈ వార్తలను ఖండింది. ఫహాడీ షరీఫ్ పోలీసులు మాత్రం మనోజ్ డైల్ 100 కి కాల్ చేసి, మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించాడని కంప్లైంట్ చేశాడని, అన్నారు.
మనోజ్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి గాయాలతో చికిత్స కోసం వచ్చారు. ఆయన కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తుంది. నడవలేని స్థితిలో మనోజ్ ఉన్నాడు. ఆయన మీడియాతో మాట్లాడలేదు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందనేది సస్పెన్సు గా మారింది. ఈ హీటెడ్ సిట్యుయేషన్ నడుమ మోహన్ బాబు ఓ వీడియో షేర్ చేశారు. గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన ఈ సన్నివేశం నాకెంతో ప్రత్యేకం.. అంటూ కోరికలు గుర్రాలైతే మూవీలోని ఓ ఫన్నీ సీన్ షేర్ చేశాడు. ఒకపక్క ఇంత రభస జరుగుతుంటే.. మోహన్ బాబు కామెడీ వీడియో షేర్ చేయడం ఏమిటీ? ఆయన జనాలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనే సందిగ్ధత కొనసాగుతుంది…
Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary Sri. Dasari Narayana Rao garu, and produced by Sri. G. Jagadeesh Chandra Prasad garu, this scene was a special milestone in my career. Sharing the screen with Sri. Chandramohan garu and Sri. Murali Mohan garu made it… pic.twitter.com/sIsJIDRW5C
— Mohan Babu M (@themohanbabu) December 8, 2024