drumstick leaves : చర్మం సౌందర్యం కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బ్యూటీ పార్లర్, హోమ్ రెమెడీలు అంటూ ఎన్నో ప్రోడక్ట్ వాడుతుంటారు. కానీ కొన్ని సార్లు ఫలితాలు ఉండవు. పార్లర్ చుట్టూ తిరిగినా, ఖరీదైన ప్రొడక్ట్స్ వాడినా సరే ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. కొన్ని సార్లు నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటాయి. అందుకే జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. చర్మానికి అన్ని ప్రాడక్ట్స్ వాడటం వల్ల స్కిన్ మరింత కఠినంగా తయారు అవుతుంది. ఎవరు ఎలాంటి టిప్ చెబితే ఆ టిప్ ను పాటించడం, ఆ ప్రాడక్ట్స్ ను వాడటం ఇక నుంచి మానేయండి. లేదంటే మీ స్కిన్ ను మీరే నాశనం చేసిన వారు అవుతారు. ఇక కృత్రిమ ప్రాడక్ట్స్ కంటే నాచురల్ ప్రొడక్ట్స్ మరింత బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే మీకు మునగాకు తెలుసా? దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మునగాకు వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మరి అవేంటో చూసేయండి.
మునగాకు ఉపయోగాలు చాలా మందికి తెలిసిందే. కానీ కొన్ని విషయాలు మాత్రం మర్చిపోతారు. అయితే ఈ మునగాకు మన శరీరంలో శక్తిని నింపుతుంది. అంతేకాదు.. మన జుట్టుకి, చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మునగాకు. మునగాకు ను ఉపయోగిస్తే యవ్వనంగా కనిపిస్తారు అంటున్నారు చర్మ నిపుణులు. ఎందుకంటే.. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఈ లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మునగాకులో మల్టీ విటమిన్లు ఉంటాయి. ఇవి ఎలాంటి చర్మం వారికైనా అద్భుతంగా పని చేస్తాయి.
మునగాకులో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. సహజంగా యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ మునగాకు బెస్ట్ సొల్యూషన్ అంటున్నారు నిపుణులు. చర్మాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తుంది. చర్మానికి రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. డీటాక్స్ ఫై చేస్తుంది ఇది. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. మొటిమలతో బాధ పడుతున్న వారు కూడా ఈ మునగాకును ఉపయోగించవచ్చు. అంతేకాదు మొటిమలను రాకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. మెరిసేలా చేస్తుంది.
మునగాకులను ఆరబెట్టి పొడి చేయాలి. ఈ మునగాకున స్క్రబ్బర్ వాడొచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పూర్తిగా మాయం అవుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. మునగాకు పేస్టుతో ముఖానికి ఫేస్ ఫ్యాక్ వేసుకోవచ్చు. ఇది కూడా మీ చర్మాన్ని అందంగా మారుస్తుంది. అంతేకాదు మునగాకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించాలి. ఆ తర్వాత.. వడపోసి.. ఆ నీటిని ఫేస్ టోనర్ గా వాడినా మంచి ఫలితాలు ఉంటాయి. చర్మానికి మంచి మృదుత్వాన్ని అందిస్తుంది ఈ మునగాకు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..