Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు రవియోగంతోతో పాటు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభ రాశి:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మిథున రాశి:
పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఉపాధి కోసం చూసేవారు శుభవార్తలు వింటారు. బంధువుల సహకారంతో కొన్ని పెట్టుబడులు పెడుతారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి.
సింహారాశి:
కొందరితో వాదోపవాదనలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉ:టాయి. కొన్ని ప్రదేశాల నుంచి ఇంటికి వస్తువులు వస్తాయి. సోదరుల సహాయంతో సాయంత్రం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.
కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనూహ్యంగా కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. దీంతో మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. చట్టపరమైన విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
తుల రాశి:
కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులు బిజీగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ఆదాయం పొందుతారు. కొన్ని విషయాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.
ధనస్సు రాశి:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆదాయం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. పిల్లల భవిష్యత్ గురించి శుభవార్తలు వింటారు.
మకర రాశి:
ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అదనపు ఆదాయం కోసం ప్రతయ్నాలు చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.
కుంభరాశి:
వ్యాపారులు లాభాలు పొందుతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయంతో ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి:
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ వేస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.