https://oktelugu.com/

Big Boss Telugu 8: ఎలిమినేట్ అయ్యాక అభయ్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన బిగ్ బాస్..బాగా పగబట్టేసాడుగా!

నిఖిల్ నేను నామినేట్ అవుతానులే అనగా, అభయ్ వినకుండా 'ఏమి అవసరం లేదు..నేను నామినేట్ అవుతా..జనాలు నన్ను సేవ్ చేస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పి తనకి తానుగా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఈ నమ్మకం ఆయనకీ హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ భజన చేయడం వల్ల వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 08:07 AM IST

    Big Boss Telugu 8(1)

    Follow us on

    Big Boss Telugu 8: అతి విశ్వాసం మంచిది కాదు అని పెద్దలు ఊరికే చెప్పరు, అలా అతి విశ్వాసం తో ముందుకు దూసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు ఏ స్థితికి పడిపోయారో మన కళ్లారా ఎన్నో ఉదాహరణలు చూసాము. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో అభయ్ కూడా మరో ఉదాహరణగా నిలిచాడు. ఈయన హౌస్ లోకి ఎంటర్ అయిన కొత్తల్లో ప్రతీ ఒక్కరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కంటెస్టెంట్స్ కూడా అదే విధంగా భావించి ఈయనకి భజన చేసేవారు. దీంతో మనోడు తోపు అనుకొని నిరంతరం తన బలుపుని చూపించే ప్రయత్నం చేసాడు. గత వారం ఈయన చీఫ్ అయ్యాడు. నిఖిల్ కూడా చీఫ్ అయ్యాడు. చీఫ్స్ అయిన వీరిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని, అది మీరిద్దరూ చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ అంటాడు.

    నిఖిల్ నేను నామినేట్ అవుతానులే అనగా, అభయ్ వినకుండా ‘ఏమి అవసరం లేదు..నేను నామినేట్ అవుతా..జనాలు నన్ను సేవ్ చేస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పి తనకి తానుగా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఈ నమ్మకం ఆయనకీ హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ భజన చేయడం వల్ల వచ్చింది. ఆయన ఆట తీరు కూడా చాలా మారిపోయింది. ప్రతీ టాస్కు ని ఆయన చాలా తేలికగా తీసుకున్నాడు. తన టీం ని గెలిపించే కసి ఇతనిలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆడియన్స్ ఈయనకి ఓట్లు వేయడం మానేశారు. ఫలితంగా ఎలిమినేట్ అయ్యాడు. మరో విశేషం ఏమిటంటే అభయ్ బిగ్ బాస్ హౌస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్ నుండి మూడవ కంటెస్టెంట్ గానే ఎలిమినేట్ అయ్యాడు. ఆడే సత్తా ఉన్నప్పటికీ కూడా, మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కేవలం మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఇతను పొగరుతో, బలుపుతో బిగ్ బాస్ ని ఎన్ని అనరాని మాటలు అన్నాడో మనమంతా చూసాము. ఏమిటి ఇతను బిగ్ బాస్ ని ఇన్ని మాటలు అంటున్నాడు అని అందరూ అనుకున్నారు.

    కానీ మనం టెలికాస్ట్ లో చూసింది కొన్ని మాత్రమే, బిగ్ బాస్ టీం అతను మాట్లాడిన మాటలన్నీ కట్ చేసి ఒక వీడియో గా తయారు చేసి శనివారం ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేసారు. ఆ మాటల్ని చూస్తే ఎలాంటి వాడికైనా కోపం వచ్చేస్తుంది. నాగార్జున కాబట్టి అతనిని గౌరవంగా హౌస్ నుండి పంపించాడు, ఇదే తరహా ప్రవర్తన తమిళ బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ లో ఉండుంటే మొహమాటం లేకుండా రెడ్ కార్డు ఇచ్చి పంపేసావారు. కానీ కోట్లాది మంది వీక్షించే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో పై అన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అభయ్ మీద బిగ్ బాస్ టీం పరువు నష్టం దావా వేసే అవకాశాలు ఉన్నాయట. అంటే ఇచ్చే రెమ్యూనరేషన్ ఇవ్వరు, అభయ్ యే తిరిగి బిగ్ బాస్ టీం కి డబ్బులు కట్టాల్సి ఉంటాది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.