Devara Pre Release Event: ఎంతో అట్టహాసంగా జరగాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లోని నోవొటెల్ హోటల్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఇక్కడ మీడియం రేంజ్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయడమే చాలా కష్టం, ఎందుకంటే చిన్న ఆడిటోరియం, అభిమానుల కెపాసిటీ ని తట్టుకోలేదు. అలాంటిది ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ ప్రాంగణం ఎలా సరిపోతుంది?, అయితే ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇలా భారీ స్థాయిలో అభిమానులు వస్తారని భావించి ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీంతో మేకర్స్ నోవొటెల్ లో ఫిక్స్ చేసారు. కేవలం 5 వేల మంది అభిమానులు మాత్రమే సరిపడే ఈ ప్రాంగణంలో పీఆర్ టీం కి సంబంధించిన ఒక వ్యక్తి ఏకంగా 10 వేల పాసులు అభిమానులకు ఇచ్చాడట. ఇది చాలా మోసం కదూ!, నోవొటెల్ లో అవాంఛనీయ సంఘటనలు జరగడానికి మొట్టమొదటి కారణం ఇదే.
సాధారణంగా పాసులు అభిమానులకు ఉచితంగానే ఇస్తారు, కానీ అతను ప్రతీ పాస్ ని డబ్బులకే అమ్మాడట. ఇది టీడీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో చెప్పిన మాట. డబ్బులకు కక్కుర్తి పడి, పీఆర్ టీం కి సంబంధించిన వ్యక్తి ఇలాంటి కక్కుర్తి పని చేయడం వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హాల్ నిండిపోవడం తో పోలీసులు అభిమానులను లోపలకు అనుమతించలేదు. కానీ వాళ్ళ దగ్గర పాసులు ఉన్నాయి. అంతమందికి ఆయన పాసులు ఎలా ఇచ్చాడో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అదృష్టం ఏమిటంటే ఈ ఈవెంట్ లో ఎలాంటి దుర్ఘటన జరగలేదు. గతం లో ఎన్టీఆర్ నటించిన ‘బాధ్ షా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసిలాట జరిగింది. ఆ తొక్కిసిలాటలో ఒక అభిమాని ప్రాణాలు పోయాయి.
అప్పట్లో ఈ ఘటన పెను దుమారం రేపింది, ఎన్టీఆర్ కూడా ఎంతో విచారం వ్యక్తం చేసాడు. ఈరోజు నోవొటెల్ ప్రాంగణం లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితిని చూస్తే అప్పటి సంఘటన గుర్తుకు వస్తుంది. పోలీసులు చాలా వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసారు కానీ, కుదర్లేదు. ఎన్టీఆర్ రాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక ఆయన వచ్చిన తర్వాత జనాలను కంట్రోల్ చేయడం మా వల్ల కాదంటూ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అయితే పీఆర్ టీం కి సంబంధించిన ఒక వ్యక్తి డబ్బులకు కక్కుర్తి పడి ఇలాంటి పని చేసినందుకు అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని మేకర్స్ ని అభిమానులు కోరుకుంటున్నారు.