https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులు ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.. లేదంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాల కోసం కృషి చేస్తారు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 / 08:38 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు కాలయోగం, ఇంద్ర యోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తుల, సింహ రాశుల వారికి కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. బంధువులను కలుస్తారు.

    వృషభ రాశి:
    ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాల కోసం కృషి చేస్తారు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది.

    మిథున రాశి:
    వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కోల్పేయే అవకాశం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కర్కాటక రాశి:
    సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. జీవిత భాగస్వామికి బహుమతిని అందిస్తారు. వ్యాపారానికి సంబంధించి అనుకోని ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    సింహారాశి:
    ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఇంటికి బంధువుల రాకతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కన్య రాశి:
    చట్టపరమైన వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు ఉంటాయి.

    తుల రాశి:
    కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రణాళికలు చేపడుతారు. విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. సాయంత్రి స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

    ధనస్సు రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చుులు కూడా పెరుగుతాయి. జీవిత భాగగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు.

    మకర రాశి:
    కొన్ని పనుల కారణంగా డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి.

    కుంభరాశి:
    కొన్ని శుభవార్తలు వింటారు. ప్రతికూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది.

    మీనరాశి:
    వివాహ సంబంధాలు వస్తుంటాయి. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. కొన్ని పనులకు అదనంగా ఖర్చు చేస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.