Bigg Boss Telugu 8: మన అనుకున్న వాళ్లకు, మొదటి నుండి సపోర్టుగా ఉన్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ కి సర్వసాధారణం అయిపోయింది. మణికంఠ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు అతని విచిత్రమైన ప్రవర్తన ఎవరికీ అర్థం అయ్యేది కాదు. మొదటి రోజే ఆదిత్య ఓం తో చిన్న అపార్థం కారణంగా గొడవ పెట్టుకుంటాడు. ఆదిత్య ఓం దానిని మనసుకి తీసుకోడు, మణికంఠ ని అర్థం చేసుకొని సపోర్టుగా ఉండడం ప్రారంభించాడు. అలా మొదటి రోజు నుండి మణికంఠ కి ఎవరు సపోర్టు గా ఉన్నా లేకపోయినా ఆదిత్య ఓం మాత్రం బలమైన సపోర్టుగా నిలుస్తూ వచ్చాడు. కానీ నిన్న ఆయనకు కూడా మణికంఠ చాలా బలమైన వెన్నుపోటు పొడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న అర్థరాత్రి బిగ్ బాస్ అకస్మాత్తుగా సైరెన్ మోగిస్తాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్ ప్రాంతంలోకి రాగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కంటెస్టెంట్స్ కి చెప్తాడు బిగ్ బాస్. అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు.
ముందుగా బిగ్ బాస్ నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో తక్కువ ఓటింగ్ వచ్చిన చివరి ముగ్గురు కంటెస్టెంట్స్ అయిన ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, నైనిక ని పిలుస్తాడు. హౌస్ లో ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్ అభిప్రాయాన్ని అడుగుతాడు బిగ్ బాస్. నాగ మణికంఠ వంతు వచ్చినప్పుడు ఆయన నైనిక పేరు చెప్తాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ వారం ఆయన నామినేషన్స్ లో నైనిక సరిగా ఆడడం లేదు, హౌస్ లో పెద్దగా కనిపించడం లేదు అని ఎన్నో కారణాలు చెప్పాడు. ఆయన లెక్క ప్రకారం ఆడియన్స్ లో నైనిక గ్రాఫ్ బాగా పడిపోయి ఉండాలి, ఎలిమినేషన్ అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉండాలి. కానీ మణికంఠ ఈ వారం మొత్తం అద్భుతంగా ఆడి తన సత్తా చాటుకున్న ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. వాళ్ళిద్దరి తో పోలిస్తే ఆదిత్య అన్న తక్కువ అనిపించాడు, అందుకే ఆయన ఎలిమినేట్ అవుతాడు బిగ్ బాస్ అని చెప్తాడు మణికంఠ.
ఇది ఎంత మాత్రం సమంజసమో మణికంఠ కి ఓట్లు వేసే అభిమానులు ఆలోచించుకోవాలి. ఒక అన్నయ్య లాగ ఎన్నో సూచనలు ఇచ్చేవాడు ఆదిత్య. అలా సూచనలు ఇచ్చినందుకు కూడా మణికంఠ ఒకసారి నామినేషన్ వేస్తాడు. సూచనలు ఒక లిమిట్ వరకు ఉండాలి, మీరు ‘బొమ్మరిల్లు ఫాదర్’ లాగ తయారు అయ్యారు అని ఆదిత్య ని ఇంటి నుండి బయటకు పంపేందుకు నామినేట్ చేస్తాడు మణికంఠ. ఎవరైనా ప్రపంచం లో ఇలాంటి కారణంతో నామినేట్ చేస్తాడా?, కానీ మనోడు చేసాడు, పాపం ఆదిత్య ఓం దీనికి అప్పట్లో చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా మణికంఠ హౌస్ మేట్స్ తో గొడవపడి మూలాన కూర్చొని ఏడుస్తున్నపుడల్లా ఆదిత్య దగ్గరకు వెళ్లి ఓదార్చే వాడు. అలాంటి వ్యక్తికి హౌస్ లో చివరి రోజున కూడా కృతజ్ఞత చూపించలేకపోయాడు మణికంఠ.