https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ది బెస్ట్ సంచాలక్’ గా ప్రేరణ..ఓవర్ యాక్షన్ తో రెచ్చిపోయిన యష్మీ..సోనియా స్థానం కోసం తెగ కష్టపడుతుందిగా!

మొదటి సెట్ బ్లాక్స్ ని సంపాదించడానికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దానిని దాటగానే ఇసుక బాక్స్ ఉంటుంది. అందులో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ తర్వాత స్క్రూని తిప్పి దాని క్రింద ఉన్న బ్లాక్స్ ని తీసుకొని న్యారో జిగ్ జాగ్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్లే మార్గం మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరగా బ్లాక్స్ స్టాండ్ వద్దకు వెళ్లి , కలెక్ట్ చేసిన బ్లాక్స్ మొత్తాన్ని సరైన క్రమ పద్దతి లో అమర్చాల్సి ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 08:46 AM IST

    Bigg Boss Telugu 8(71)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. గత కొద్ది రోజులుగా హౌస్ లో జరుగుతున్న టాస్కులు చాలా సాధారణంగా ఉన్నాయి, షో చూసేందుకు అసలు ఆసక్తి రావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసేవారు. అయితే నిన్న రాత్రి జరిగిన ‘రాజు అయ్యేది ఎవరు’ అనే టాస్కు ఎంతో కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ఈ టాస్కు లో నబీల్ కంటే పృథ్వీ అద్భుతంగా ఆడాడు. కానీ ఒక్క చిన్న తప్పు కారణంగా పృథ్వీ ఓడిపోయాడు, నబీల్ గెలిచి ఇంటికి మెగా చీఫ్ అయ్యాడు. ఈ టాస్కు గెలవాలంటే చేయాల్సింది లెటర్ బ్లాక్స్ ని సరైన పదం గా ఏర్పాటు చేయడం. ఆ బ్లాక్స్ ని సంపాదించడానికి కంటెస్టెంట్స్ ఇద్దరు కొన్ని అడ్డంకులను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడ్డంకి ని పూర్తి చేసే కొద్దీ కొన్ని బ్లాక్స్ కంటెస్టెంట్స్ కి లభిస్తూ ఉంటాయి.

    మొదటి సెట్ బ్లాక్స్ ని సంపాదించడానికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దానిని దాటగానే ఇసుక బాక్స్ ఉంటుంది. అందులో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ తర్వాత స్క్రూని తిప్పి దాని క్రింద ఉన్న బ్లాక్స్ ని తీసుకొని న్యారో జిగ్ జాగ్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్లే మార్గం మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరగా బ్లాక్స్ స్టాండ్ వద్దకు వెళ్లి , కలెక్ట్ చేసిన బ్లాక్స్ మొత్తాన్ని సరైన క్రమ పద్దతి లో అమర్చాల్సి ఉంటుంది. ముందుగా ఎవరైతే కరెక్ట్ గా పెడుతారో, వాళ్ళు ఈ టాస్కు ని గెలిచి మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్కుకి ప్రేరణ సంచాలక్ గా వ్యవహరించింది. ఈ టాస్కు లో పృథ్వీ నబీల్ కంటే చాలా వేగంగా టాస్కు ని పూర్తి చేస్తాడు. ‘ఐ యామ్ మెగా చీఫ్’ అనే పాదాల మధ్య కచ్చితంగా గ్యాప్ ఉండాలి. అది రూల్ బుక్ లో ఉన్న ప్రధానమైన అంశం, నబీల్ దానిని తూచా తప్పకుండా పాటించి సరైన క్రమ పద్దతి లో పెడుతాడు. కానీ పృథ్వీ మాత్రం ‘I’ కి ‘AM’ కి మధ్యలో గ్యాప్ ఇవ్వడు. ఈ చిన్న పొరపాటు కారణంగా ప్రేరణ నబీల్ ని విన్నర్ గా ప్రకటిస్తుంది.

    సంచాలక్ గా ఆమె తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ కరెక్ట్. కానీ యష్మీ గౌడ చేసిన అతి మాత్రం మామూలుది కాదు. ఆమె టాస్కు ఓడిపోయిన అంతగా ఏడ్చేది కాదేమో, కానీ పృథ్వీ ఓడిపోవడంతో గంటసేపు ఏడ్చింది. బోనస్ గా విష్ణు ప్రియ తో కలిసి ఏడవడం గమనార్హం. సంచాలక్ గా ప్రేరణ ఎలాంటి బేషజాలం లేకుండా నిర్ణయం తీసుకుంది. దానికి యష్మీ ‘పృథ్వీ చాలా వేగంగా పెట్టాడు. అతనికి ఇవ్వొచ్చు కదా, మనకి సపోర్ట్ చేస్తుంది కదా అనుకుంటే, వాళ్లకు సపోర్ట్ చేసింది, బహుశా ఆమెకు పృథ్వీ మెగా చీఫ్ అవ్వడం ఇష్టం లేదేమో’ అంటూ తెగ రచ్చ చేసింది. ఓడిపోయిన పృథ్వీ సైలెంట్ గా ఉన్నాడు, కానీ ఈమె మాత్రం విశ్వరూపం చూపించేసింది. రోజురోజుకి మారుతున్న యష్మీ ప్రవర్తన ని చూసి ఈమెకంటే సోనియానే బెటర్ కదా అని అంటున్నారు నెటిజెన్స్.