Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు రవియోగం, ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. దీంతో కర్కాటకం, మీనం సహా కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. వ్యాపారులు గందరగోళంతో కనిపిస్తారు. అనుకున్న లాభాలు రాకపోయేసరికి నిరాశతో ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. ముఖ్యంగా కుటుబ సభ్యుల్లో ఒకరు వ్యాధిబారిన పడుతారు.
వృషభ రాశి:
ఉద్యోగులు అనుకున్న ప్రాజెక్టును పూర్తి చేస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఖర్చులు తగ్గించడం వల్ల ఆదాయం పెరిగినట్లు కనిపిస్తుంది. కొత్త అప్పుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కొపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టపోతారు.
మిథున రాశి:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో క్రమంగా లాభాలు వస్తుంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.శత్రువుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి:
వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొన్ని తప్పులు చేస్తుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
సింహారాశి:
వ్యాపారులు ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు చరేస్తారు. పెట్టుబడులపై లాభాలు పెరుగుతాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సంయమనంతో సమస్యను పరిష్కరించుకోవాలి.
కన్య రాశి:
పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
తుల రాశి:
సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఖర్చులు పెరగడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు లాభాలు తగ్గుతాయి. అయతే ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. దీంతో ప్రశాంతంగా ఉంటారు.
వృశ్చిక రాశి:
చేయని తప్పుకు నిందను మోయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయాల్లో సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి:
ఏ పని చేపట్టినా పూర్తి చేయాలి. లేకుంటే సమస్యలు ఎదుర్కొంటారు. డబ్బు విషయంలో ఇతరులతో గొడవలు పడే అవకాశం. అయితే కాస్త చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుంచి బయటపడాలి.
మకర రాశి:
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగొద్దు. కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి.
కుంభరాశి:
మీ పనిలో ఇతరులు జోక్యం చేసుకోనివ్వద్దు. వ్యాపారులకు కాస్త లాభాలు తగ్గుతాయి. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి.
మీనరాశి:
వ్యాపారులు అనుకున్న లాభాలు పొందలేరు. ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావొచ్చు. ఆస్తులకు సంబంధించి కొంత సమాచారం ఆందోళన కలిగిస్తుంది.