Women: ఆడవాళ్లు ఇంటా, బయట ఎన్నో ఫుల్ గా వర్క్ చేస్తుంటారు. మగవాళ్లకంటే ఆడవాళ్లకే బాధ్యతలు ఉంటాయి కదా. దీనివల్లే ఆడవారు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ దీనివల్లే వీరు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. అయితే కొన్ని నియమాలు పాటిస్తేనే ఆరోగ్యం కూడా. మరి ప్రతి రోజు మీరు చేసుకోవాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..
ఏదేమైనా, ఎన్ని పనులు ఉన్నా సరే కొన్ని అలవాట్లు మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అని గుర్తు పెట్టుకోండి. అందుకే ఆడవారు ఖచ్చితంగా తమ రోజువారి ఆహారంలో అంజీర, మఖానా,ఖర్జూరాలను చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ మూడు డ్రై ఫ్రూట్స్ పీరియడ్స్, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో మీకు సహాయం చేస్తాయి. అంతేకాదు ఇవి కటి ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయి. ఆడవారి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి ఈ డ్రై ఫ్రూట్స్. అలసట రానివ్వవు.
ఆడవాళ్లు ప్రతిరోజూ కూల్ వాటర్ తో ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అవును కూల్ వాటర్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగ్గా జరిగేలా చేస్తుంది. అంటే మీ చర్మం సహజంగా మెరుస్తుంది అన్నమాట. అంతేకాదు చర్మ రంధ్రాలను తగ్గిస్తాయి కూల్ వాటర్. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ముఖంపై లేకుండా చేస్తాయి. కూల్ వాటర్ కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను, కంటి వాపును తగ్గిస్తాయి.
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలం మృదువుగా ఉండటానికి, సులభమైన మల విసర్జనకు సహాయపడుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్య ఉంటే కూడా తగ్గిపోతుంది. కడుపు ఉబ్బరం కూడా మాయం అవుతుంది.
ఆడవారు ప్రతి రోజు విత్తనాలను కూడా తినాలి. అంటే గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు, శనిగలు, పెసర్లు వంటి విత్తనాలు చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. కాబట్టి ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మలబద్దకం సమస్య మాయం అవుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ జుట్టు రాలకుండా చేస్తుంది. వెంట్రుకలను బలంగా ఉంచి.. హెయిర్ పెరగేలా చేస్తుంది.
ఉదయాన్నే ఆడవాళ్లు ముఖాన్ని, మెడను మసాజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ముఖం వాపు వంటి సమస్యలు రావు. అలాగే ముఖ కండరాలు రిలాక్స్ అవడమే కాకుండా రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుంది. ముఖంపై ఉండే ముడతలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు మీ డైలీ లైఫ్ లో యోగా, వ్యాయామం కూడా భాగం చేసుకోవాలి. ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. యోగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరం యోగ.