https://oktelugu.com/

Horoscope Today : ఈరోజు గజకేసరి యోగంతో రెండు రాశుల వారికి ఆదాయం డబుల్..

మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ అవసరాలన్నీ తీరుతాయి. స్నేహితుని సాయంతో ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2024 / 08:26 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గజకేసరి యోగం ఏర్పడడంతో కొన్నిరాశుల వారి ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగులుపదోన్నతి పొందే అవకాశం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి విలువైన బహుమతిని కొనుగోలు చేస్తారు.

    వృషభరాశి:
    అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మనసు ఆందోళనగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మిథున రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలు బలపడుతాయి. ఇంటికి అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి.

    కర్కాటక రాశి:
    శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    సింహా రాశి:
    వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కుటంబ భాధ్యతలు పెరుగుతాయి. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు సాగించాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి.అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.

    కన్యరాశి:
    శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వివాహితులకు ప్రతిపాదనలు వస్తాయ. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    తుల రాశి:
    విదేశాల్లో చదువుకునేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి లభిస్తుంది. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి ఇదే మంచి సమయం. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    వృశ్చిక రాశి:
    పెద్దల ఆశీస్సులతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో పదోన్నతి లభించే అవకాశం.

    ధనస్సు రాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంని నిరాశకరమైన వార్తలు వింటారు. స్నేహితుల నుంచి డబ్బు సాయం అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    మకర రాశి:
    కుటుంబ వాతావరణం ఆందోళనగా ఉంటుంది. అదనపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు.

    కుంభ రాశి:
    మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ అవసరాలన్నీ తీరుతాయి. స్నేహితుని సాయంతో ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బ్యాంకు రుణం అందుతుంది. దీంతో కొన్ని అవసరాలు తీరుతాయి.