Vikatakavi Review : తెలుగులో డిటెక్టివ్ కు సంబంధించిన థ్రిల్లర్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కారణం ఏదైనా కూడా ఇలాంటి సిరీస్ లుగానీ, సినిమాలు గానీ వచ్చినప్పుడు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూ ఉంటారు. దానివల్ల అలాంటి సినిమాలకు క్రేజ్ పెరగడమే కాకుండా మంచి గుర్తింపు కూడా వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే నరేష్ అగస్త్య మెయిన్ లీడ్ లో వికటకవి అనే సీరీస్ అయితే వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సీరీస్ కథ విషయానికి వస్తే రామకృష్ణ(నరేష్ అగస్త్య) అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఇక డిటెక్టివ్ అంటే అతనికి చాలా ఇష్టం…దాని వల్ల ఆయన పార్ట్ టైం డిటెక్టివ్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన పోలీసులకు సాల్వ్ కానీ కొన్ని కేసులను సాల్వ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన టాలెంట్ ను గుర్తించిన చాలా మంది ఆయన్ని డిటెక్టీవ్ గా పరిగణిస్తూ వాళ్లకు సంబంధించిన విషయాలను అతనితో షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎలాంటి సిచువేషన్స్ ను ఎదుర్కొన్నాడు. ఆయనకి అప్పజెప్పిన కేసులను పర్ఫెక్ట్ గా చేశాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ ను మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే ఈ సీరీస్ ను చాలా ఎక్స్ట్రాడినరీగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఎక్కడా కూడా తను డివియేట్ అవ్వకుండా ఒక కథను నమ్మి ముందుకు వెళ్లిన క్రమమైతే చాలా బావుంది. తెలంగాణ స్లాంగ్ లో సాగీన ఈ సిరీస్ ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఒక సిరీస్ ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. డిటెక్టివ్ కి సంబంధించిన సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా తెలుగులో మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక ఆ తరహాలోని ఈ సిరీస్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అయితే సంపాదించుకోవడమే కాకుండా దర్శకుడి యొక్క విజన్ మనకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన రీసెర్చ్ గాని ఆయన ఈ సినిమా మీద పెట్టిన ఎఫర్ట్ కానీ మనకు ప్రతి సీన్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్ల డీటెలింగ్ అయితే చాలా అద్భుతంగా రాసుకున్నాడు. థ్రిల్లర్ పాయింట్స్ రివిల్ చేసే సమయంలో దర్శకుడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు.ఇక ఈ సిరీస్ కి సినిమాటోగ్రఫీ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యింది. లిమిటెడ్ బడ్జెట్ లో సిరీస్ ను చాలా ఎక్స్ట్రాడినర్ గా తీశారు అనే చెప్పాలి. విజువల్స్ పరంగా సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నరేష్ అగస్త్య ఇంతకుముందు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. ఇక తన కెరియర్ లో ఇప్పటివరకు డిటెక్టివ్ కు సంబంధించిన సినిమాలు అయితే చేయలేదు. కాబట్టి ఆయన ఈ పాత్రలో చాలా కొత్తగా కనిపించడమే కాకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ మొదటినుంచి చివరి వరకు ఎక్కడా కూడా తను ఆ పాత్ర నుంచి డివియేట్ అవ్వకుండా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక ఆ పాత్రను దర్శకుడు మలిచిన విధానం కూడా చాలా బావుంది. దానికి తగ్గట్టుగానే ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద ముందుకు తీసుకెళ్లాడు… ఇక తనతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులందరు కూడా తనను సపోర్ట్ చేస్తూ చాలా బాగా నటించారు. ఇక మొత్తానికైతే వికటకవి అనే ఒక టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ నరేష్ అగస్త్య చాలా చక్కగా నటించాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ కొంతవరకు ఈ సినిమాకి మైనస్ అయినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఓకే అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి… ఇక ఈ సినిమా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎక్కడ సినిమా మూడ్ ను చెడగొట్టకుండా డిఓపి తనదైన రీతిలో వర్క్ చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఈ సినిమాకి దక్కిన మంచి సక్సెస్ అనే చెప్పాలి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఈ సిరీస్ కి తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా చాలా సెట్ అయ్యాయి…
ప్లస్ పాయింట్స్
కథ
నరేష్ అగస్త్య యాక్టింగ్
ట్విస్టులు
మైనస్ పాయింట్స్
3,4 ఎపిసోడ్స్ కొంచెం స్లో అనిపించాయి…
కొన్ని అనవసరమైన సీన్స్…
రేటింగ్
ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5