Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా విజయాలే..
Horoscope Today: 2024 జూన్ 24 సోమవారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ఇంద్ర యోగం, బుధాదిత్య యోగం సందర్భంగా కొన్ని రాశుల వారికి ఏ పని చేసినా విజయం కలుగుతుంది. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సీనియర్లతో వాగ్వాదం ఉండే అవకాశం. వ్యాపారులకు సైతం శ్రమ అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎక్కువగా వాదనలు చేయద్దు.
వృషభ రాశి:
వ్యాపారులకు అనుకొని లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆస్తికి సంబంధించిన చర్చ అధికంగా ఉంటుంది. సాయంత్రం తల్లిదండ్రుల సలహాతో సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథున రాశి:
పాత అప్పులను తీరుస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కానీ కొందరితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి.
కర్కాటక రాశి:
కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్నా వారి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.
సింహారాశి:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం మార్చాలని చూస్తే ఇతరుల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి.
కన్య రాశి:
ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువుల్లో కొందరితో వాగ్వాదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
తుల రాశి:
వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మనస్స ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారుల కు అనేక లాభాలు వస్తాయి. దీంతో ఉల్లాసంగా గడుపుతారు.
మకర రాశి:
అనారోగ్యానికి గురయ్యే అవకాశం. ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఎవరిని నమ్మాలో ఎవరైనా నమ్మొద్దో తెలియక అయోమయానికి గురవుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.
కుంభరాశి:
కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారులు ఇతరుల సలహాలతో పెట్టుబడులు పెడతారు.
మీనరాశి:
ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.