Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో మార్పులు ఉంటాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాశిలపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం. మరికొందరు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు చేసే కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఓవైపు ఆదాయం పెరుగుతున్న ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అందువల్ల ఆచితూచి అడుగులు వేయాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): తండ్రి సహాయంతో వ్యాపారులు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు నీటితో పరిష్కారం అవుతాయి. రోజువారి అవస రాలకు ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. దైవ క్షేత్రాలను సందర్శిస్తారు. కొందరు కొత్త వ్యక్తులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వారిని పట్టించుకోకుండా ఉండడమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త బాధ్యతలను చేపడతారు. సాయంత్రం బంధువులను కలుస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కుటుంబంలో ప్రతికూల వాతావరణ ఉంటుంది మాటలను అదుపులో ఉంచుకోవాలి వ్యాపారులు కొత్త పెట్టుబడును పెడతారు ఒరే విషయంలోకి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : తోటి ఉద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తిచేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి .కొత్త వారితో వాగ్వాదం జరిగితే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కొత్త శత్రువులు ఇబ్బంది పడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒక డీల్ కుదరడం వలన వ్యాపారులు సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : పాత బకాయిలను తీరుస్తారు. చిరుత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందే అవకాశం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఖర్చులు పెరగడం వలన ఆందోళనగా ఉంటుంది. ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. అనుకోకుండా లాభాలు పొందే మార్గాలు ఏర్పడతాయి. దీంతో వ్యాపారంలో ఉల్లాసంగా ఉంటారు.