https://oktelugu.com/

Game changer : ‘గేమ్ చేంజర్’ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..సంబరాల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!

సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ లో బెనిఫిట్ షోస్ , టికెట్ హైక్స్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇచ్చే సమస్యే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 08:04 AM IST

    Game changer

    Follow us on

    Game changer : సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ లో బెనిఫిట్ షోస్ , టికెట్ హైక్స్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇచ్చే సమస్యే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. వచ్చే ఏడాది నుండి వరుసగా పాన్ ఇండియన్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం థియేట్రికల్ రెవిన్యూ పై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని కంగారు పడ్డారు. అయితే ఆ సినీ ప్రముఖులు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం, ఆయనతో పలు అంశాల పై చర్చించడంతో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికి టికెట్ హైక్స్ వస్తాయని ఆశపడ్డారు. దిల్ రాజు కూడా మొన్నటి ప్రెస్ మీట్ లో ఇదే ఆశని బయటపెట్టి సీఎం రేవంత్ సార్ ని కలవబోతున్నాను అని చెప్పుకొచ్చాడు.

    తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. కానీ ఎట్టి పరిస్థితి లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి వీలు లేదని, పోలీసులు అందించిన సూచనలను తూచా తప్పకుండ అనుసరించాలని దిల్ రాజు కి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశాడట. ఏడైన జరగరానిది జరిగితే ఈసారి సదరు థియేటర్ కి లైసెన్స్ బ్యాన్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. దిల్ రాజు కూడా ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాధ్యతాయుతంగా తీసుకొని జాగ్రత్తగా ఉండబోతున్నాడు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు మధ్యాహ్నం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిమానులు తెలుగు రాష్ట్ర అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    ఇప్పటికే కర్ణాటక లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. కేవలం బెంగళూరు సిటీ నుండే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బెనిఫిట్ షోస్ కి 600 పెడితే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. సింగల్ స్క్రీన్ బుకింగ్స్ మొదలు పెట్టారు కానీ, మల్టీప్లెక్స్ షోస్ కి సంబంధించిన బుకింగ్స్ మొదలు అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఫైనల్ ప్రీ సేల్స్ 3 కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆ స్థాయిలో ఉంటే మొదటి రోజు ఈ చిత్రానికి కచ్చితంగా 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.