Homeఅంతర్జాతీయంUS Israel strategies against Iran: బెడిసి కొడుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ వ్యూహాలు.. ఇరాన్‌లో పెరుగుతున్న ఐక్యత!

US Israel strategies against Iran: బెడిసి కొడుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ వ్యూహాలు.. ఇరాన్‌లో పెరుగుతున్న ఐక్యత!

US Israel strategies against Iran: అణు కార్యకలాపాలు ఆపడం లేదని, ఉగ్రవాదులను తయారు చేస్తుందని అమెరికా మిడిల్‌ ఈస్ట్‌లో రాజేసిన మంటలు ఇటు ఇరాన్‌తోపాటు గల్ఫ్‌ దేశాలను దహించి వేస్తున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక భారం పెరుగుతోంది. అమెరికాకు అండగా నిలిచిన గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌ దాడులతో అల్లాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌ ప్రజలను విభజించి అధికార మార్పిడి చేయాలన్న అమెరికా వ్యూహం ఫలించడం లేదు.

రణనీతి విఫలం
అణ్వాయుధ కార్యక్రమాలను ఆపడం, మత ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు చేశాయి. టెహ్రాన్‌లో సుప్రీం లీడర్‌ ఖమేనీ, ఐఆర్‌జీసీ కీలక నాయకులను లక్ష్యంగా చేసి యుద్ధం తీవ్రతరం చేశాయి. అయితే, ఈ చర్యలు ఇరాన్‌ ప్రజల్లో జాతీయ భావనను రేకెత్తించి, మత రాజ్యానికి మద్దతును పెంచాయి. హిజాబ్‌ ఆందోళనల్లో విడిపోయిన సమాజం ఇప్పుడు విదేశీ దాడిని సార్వభౌమ రక్షణగా చూస్తోంది.

ఇరాన్‌ సైనిక వ్యవస్థ లోపాలు..
ఇరాన్‌ సైన్యం గూఢంగా, పొంతన లేని యూనిట్ల సమ్మేళనంతో పనిచేస్తుంది. ఐఆర్‌జీసీ కింద బాసిజ్‌లా ప్రజా మిలిషియా సంక్షోభాల్లో ప్రభుత్వానికి మద్దతు సమీకరిస్తాయి. ఈ రహస్య నెట్‌వర్క్‌ దాడులను ముందస్తు అడ్డుకోలేకపోయినా, విదేశీ జోక్యం ద్వారా అన్ని వర్గాలు జాతీయవాదం ఏకమై, మత నాయకులకు బలం చేకూర్చాయి.

కూటమి బలహీనత
ఇరాన్‌ మద్దతుతో హెజ్‌బొల్లా, హౌతీలు, హమాస్, ఇరాక్‌–సిరియా గ్రూపులు బలపడ్డాయి. కానీ, గాజా విధ్వంసం, హెజ్‌బొల్లా నాయకత్వ నాశనం, అసద్‌ పతనం, హౌతీల ప్రభావం తగ్గడంతో ఈ కూటమి బలహీనపడింది. ఇరాన్‌ ఒంటరిగా మిగిలి, హర్మూజ్‌ జలసంధి మూసివేసి ప్రపంచ చమురు వాణిజ్యాన్ని ఆడ్డించింది.

అమెరికా హిజాబ్‌ నిరసనల సమయంలో ప్రత్యేక సహాయం చేయకపోవడం, మాటలకే ఆగిపోవడం పెద్ద తప్పు. అంతర్గత మార్పు జరిగే వరకు ఆగి ఉంటే మత పాలన సహజంగా కూలేది. ఇప్పుడు దాడులు ప్రజలను ఏకం చేసి, ఖమేనీ పాలనకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాలు అమెరికా వైపు కొనసాగుతాయా లేక తటస్థంగా ఉంటాయా అనేది కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version