Homeఎంటర్టైన్మెంట్Allu Arjun angry at bouncers viral video: అభిమానులను ఆపుతున్న బౌన్సర్లపై అల్లు అర్జున్...

Allu Arjun angry at bouncers viral video: అభిమానులను ఆపుతున్న బౌన్సర్లపై అల్లు అర్జున్ ఫైర్..సంచలనం రేపుతున్న వీడియో!

Allu Arjun angry at bouncers viral video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి తన అభిమానులు అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో మనం చూశాం . కొన్ని ఈవెంట్స్ లో అయితే ఆయన తన అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన అభిమానులను ప్రేమతో ఆయన ఆర్మీ అని పిలుచుకుంటూ ఉంటాడు. చాలా మంది అల్లు అర్జున్ కి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, ఆయన్ని కలవాలంటే 42 రూల్స్ పాటించాలి అంటూ దుష్ప్రచారాలు చేస్తుంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ చాలా డౌన్ టు ఎర్త్ గా ఉండే మనిషి అని వివిధ సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. తన ఇంట్లో పని మనిషి కి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఆయన గతం లో ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

పాన్ ఇండియా సూపర్ స్టార్ , రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న సెలబ్రిటీ అయినప్పటికీ కూడా మన తోటి స్నేహితులతో ఎలా ఉంటామో, అల్లు అర్జున్ కూడా అలాగే ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు బౌన్సర్లు చుట్టముట్టడం, అభిమానులను తోసేయడం వంటివి గతం లో మనం ఎంతోమంది హీరోల విషయం లో చూశాము . సెల్ఫీ అడిగితే ఫోన్లు విసిరిగొట్టడం , చెంప పగలగొట్టడం వంటివి కూడా చాలా మంది హీరోలు చేశారు. అలాంటి హీరోలు ఉన్న ఈ కాలం లో అభిమానుల కోసం తన బౌన్సర్ల మీద ఫైర్ అయిన హీరో ని ఎప్పుడైనా చూశారా ? , అలా అల్లు అర్జున్ ని తప్ప మరో హీరోని ఇప్పటి వరకు చూడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా ఒక ఈవెంట్ కి అల్లు అర్జున్ వెళ్ళాడు.

Also Read: చిరంజీవి డ్రీమ్ క్యారెక్టర్ చేసిన నాగార్జున…మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే..?

అక్కడ ఆయనతో సెల్ఫీలు దిగడానికి కొంతమంది అభిమానులు వచ్చారు. కానీ బౌన్సర్లు వాళ్ళని అల్లు అర్జున్ దగ్గరకు రానివ్వడం లేదు. ఇది గమనించిన అల్లు అర్జున్ తన బౌన్సర్లకు పక్కకి జరగమని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం , అభిమానిని దగ్గరకు పిలిచి సెల్ఫీ ఇవ్వడం హైలైట్ గా నిల్చింది. ఇంత గొప్ప గా అభిమానులను ట్రీట్ చేస్తున్నందుకు కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు. గతం లో కూడా ఇంతే. అల్లు అర్జున్ తన అత్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అప్పుడు బౌన్సర్లు అభిమానులను తోయడాన్ని గమనించిన అల్లు అర్జున్ ‘ఏంటి తోస్తున్నావ్.. ‘ అంటూ సీరియస్ గా అతనికి వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్లిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. మరోసారి అలాంటి సంఘటన ఇప్పుడు రిపీట్ అవ్వడం గమనార్హం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version