https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశులపై గురు, శుక్ర గ్రహాల ప్రభావం.. దీంతో ఊహించిన లాభాలు..

విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం గురించి చర్చలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 7:30 am
    Horoscope Today

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో అనుకోని మార్పులు ఉంటాయి. గురువారం ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల పై గురు, శుక్ర గ్రహాల ప్రభావం కారణంగా తుల, మీనం రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణం చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు ఆయా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. వ్యాపార అభివృద్ధిలో వేగం అందుకుంటుంది. కుటంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.

    వృషభ రాశి:
    విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం గురించి చర్చలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.

    మిథున రాశి:
    ఈ రాశివారికి ఈరోజు శత్రువుల బెడద ఎక్కువ. దీంతో కొంత ఆందోళనకు గురవుతారు. ఒక పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

    కర్కాటక రాశి:
    కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రి తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా శుభకార్యాల గురించి చర్చించుకుంటారు.

    సింహారాశి:
    విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. సాయంత్రం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    కన్య రాశి:
    కుటంబంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. సంబంధాలు మెరుగుపడుతాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    తుల రాశి:
    వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా లాభాలు వస్తాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఉత్సాహంగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటంబంలో ఎటువంటి చీలకలు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి ప్రయోజనాలు ఉంటాయి.

    ధనస్సు రాశి:
    విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పడుతాయి. కార్యాలయాల్లో పనిచేసేవారికి ప్రశంసలు అందుతాయి. కొందరు ఉద్యోగులు వేధింపులు ఎదుర్కొంటారు. వివాహం చేసుకోవాలనే వారు శుభవార్తలు వింటారు.

    మకర రాశి:
    జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

    కుంభరాశి:
    ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల ప్రశంసలు పొందుతారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కటుుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మీనరాశి:
    జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా ఖర్చు చస్తారు. దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైనా కొత్తగా డబ్బు ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకుంటే ఇదే మంచి సమయం.