Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు మొదలుపెట్టిన పనులు అన్ని పూర్తి చేస్తారు. ముఖ్యమైన బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. వ్యాపారులు ప్రత్యర్థులపై కనీసం ఉంచాలి. వీరు కుటుంబ సభ్యుల అండదండలతో అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఆదాయం లో చేగురుతాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల సహాయం ఉంటుంది. దీంతో అప్పల నుంచి బయటపడతారు. ఉద్యోగులు పదోన్నతులపై శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ధన లాభం చేకూరుతుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాల్లో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనుల వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులకు సంతోషాన్ని తెప్పిస్తుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటమే మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఉద్యోగులు తోటి వారి పట్ల సంయమనంతో ఉంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపారాన్ని విస్తరిస్తారు. గతంలో ఉన్న అప్పల నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరము ఖర్చులు ఉంటాయి. డబ్బు కోసం ఇతరులను సంప్రదిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన బకాయలు వసూలు అవుతాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా వస్తువులు కొనాలని చూసేవారికి ఇదే మంచి సమయం.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తుంది. అయితే ఇదే సమయంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంశాలు అందుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అయితే ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణం లాభాలను తీసుకువస్తుంది.
