Trump Family : రాయలసీమ ఫ్యాక్సనిజంలో రక్తానికి రక్తం అన్నట్లుగా ఒకప్పుడు హత్యలు జరిగేవి. కుటుంబాలనే మట్టుబెట్టేవారు. అయితే క్రమంగా హింస పరిష్కారం కాదని మారుతున్న తరాలకు అర్థమైంది. కఠిన శిక్షలే కూడా ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తెచ్చింది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అమెరికా–ఇరాన్ మధ్య నెలకొంది. కేవలం తన ఆధిపత్యం నిరూపించుకునేందు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది. అయితే ఆశించిన ఫలితం సాధించలేదు. అయితే యుద్ధం ఫిబ్రవరి 27న ప్రారంభమైంది. రెండో రోజే ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతోపాటు టాప్ నేతలు, అధికారులను మట్టు పెట్టింది. దీంతో యుద్ధం తీవ్రమైంది.
అమెరికా మిత్రదేశాలపై దాడులు..
ఖమేనీ మరణం తర్వాత ఐఆర్‌జీసీ రంగంలోకి దిగింది. అమెరికా మిత్ర దేశాలు అయిన గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ తదితర దేశాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. హార్మూజ్ మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం మొదలైంది. దాదాపు రెండు నెలలు అమెరికా దాడులు చేసినా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఇరాన్ ప్రజలు దేశానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో అమెరికా విధిలేని పరిస్థితిలో శాంతి ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇటీవలే కుదిరిన ఒప్పందం..
ఇటీవలే స్విట్జర్లాండ్‌లో పాకిస్తాన్ సమక్షంలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మొదట తాత్కాలిక ఒప్పందం పేరిట పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ ఇరు దేశాలు పట్టు వీడకపోవడం, మెట్టు దిగకపోవడంతో ఒప్పందం జరగలేదు. సుమారు రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అమెరికా మళ్లీ ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది.
ట్రంప్ ఫ్యామిలీకి వార్నింగ్..
ఇంతకాలం అమెరికా మిత్రదేశాలపై దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు అమెరికాకే వార్నింగ్ వివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగానే అక్కడి ప్రజలు, నేతలు ట్రంప్‌ను చంపాలని నినదించారు. తాజాగా ఇరాన్ ట్రంప్‌తోపాటు ఫ్యామిలీని చంపేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. టెహ్రాన్‌లోని పాలస్టైన్ స్క్వేర్‌లో ‘రక్తానికి రక్తం’ అనే కొటేషన్‌తో బ్యానర్స్ ఏర్పాటు చేసింది. ఇందులో ట్రంప్‌తోపాటు సతీమణి మెలానియా, కూతుళ్లు ఇవాంకా, టిఫానీ, కుమారులు ట్రంప్ జూనియర్, ఎరిక్, బారోన్ ఫొటోలు, శవపేటికలను ప్రదర్శించింది. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ గతంలోనూ ప్రకటించడం తెలిసిందే.
మొత్తంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ట్రంప్ ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడికి విమానాలను తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
