Parlor : పార్లర్ లో డబ్బులు వేస్ట్ గా ఖర్చు చేశారు. సింపుల్ గా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు..

ముఖం అందంగా కనిపించాలంటే చర్మ సంరక్షణ చాలా అవసరం. రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడానికి చాలా ఉత్పత్తులు వాడుతుంటారు. స్కిన్ కేర్ రొటీన్ ఒకటే కాదు మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే చర్మ సంరక్షణ అంటే చాలా విధాలుగా ఉంటుంది. కండ్లు, లిప్స్, ఐబ్రో, చివరికి ముక్కు విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే.. ఈ రోజుల్లో చాలా మంది ముక్కు మీద బ్లాక్ హెడ్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి చిన్నగానే ఉంటాయి కానీ… మన ముఖం అందాన్ని మాత్రం పూర్తిగా తగ్గిస్తుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ తొందరగా వదలవు. నార్మల్ గా మనం ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా మాత్రం ఫేస్ మీద అవి అలాగే ఉంటాయి. స్క్రబ్ చేస్తేనే ఈ బ్లాక్ హెడ్స్ పోతాయి. వీటిని తొలగించడానికి బయటి ఉత్పత్తులు మాత్రమే కాదు కొన్ని టిప్స్ పాటిస్తే సులభంగా తొలిగిపోతాయి.

Written By: Neelambaram, Updated On : November 6, 2024 10:33 am

The money was wasted in the parlor. Blackheads can be removed simply..

Follow us on

Parlor : ముక్కు మీద ఈ నల్ల మచ్చలు ఎందుకు ఏర్పడతాయి అనేది చాలా మందికి తెలియదు. ఈ నల్ల మచ్చలు ఏర్పడటానికి అసలు కారణం చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడమేఅంటున్నారు నిపుణులు. పంచదారను ఉపయోగించి నల్ల మచ్చలకు చెక్ పెట్టవచ్చు. పంచదారతో స్క్రబ్ చేసుకోవాలి. ఇందుకోసం నిమ్మకాయను కట్ చేసి దాని పైన కొద్దిగా పంచదార చల్లి బ్లాక్ హెడ్ ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే చాలా త్వరగా నల్ల మచ్చలు తగ్గుతాయి.

బంగాళ దుంపతో కూడా మనం బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. శెనగ పిండి, బంగాళ దుంప రసం, అలోవెరా జెల్ ఈ మూడింటితో బ్లాక్ హెడ్స్ కు గుడ్ బాయ్ చెప్పవచ్చు. అయితే క్లియర్ స్కిన్ పొందడానికి ఈ పదార్థాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మన చర్మంపై రంధ్రాలను శుభ్రపరచడానికి, లోతైన ప్రక్షాళనకు మంచి సహాయకారిణిగా ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

మరి ఈ మిశ్రమాన్ని మొహానికి ఎలా రాసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి. కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జు, శెనగపిండి, బంగాళదుంప రసం వంటివి మొత్తం కూడా ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాగా కలిపాలి. ఆ తర్వాత.. ఆ పేస్టును ముక్కుపై రాసుకోవాలి. అలా రాసిన తర్వాత పది నిమిషాలు అలాగే వదిలేయాల. ఆ తర్వాత ముక్కుపై స్క్రబ్బింగ్ చేయాలి. చేతులతో సున్నితంగా రుద్దుతూ.. ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీకు పార్లర్ వెళ్లకుండానే ఈజీగా ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి. అయితే ఈ రెమిడీని కనీసం వారానికి మూడు సార్లు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. ఈజీగా ఆ ముక్కుపైన ఉన్న బ్లాక్ హెడ్స్ పోయి స్కిన్ కూడా మెరుస్తుంది.