Donald Trump: ఒకటా, రెండా.. ఎన్ని హత్యాయత్నాలు.. చావు చివరించుదాక వెళ్లి.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు..

దూసుకొచ్చిన బుల్లెట్ వెంట్రుకవాసిలో గురితప్పింది. ఒకసారి గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆడుతుంటే అప్పుడు కూడా కాల్పులు జరిగాయి. అంతకుముందు ఓ పెద్దల చిత్రాల నటి అనేక ఆరోపణలు చేసింది.. ప్రత్యర్థులు రకరకాల కేసులు పెట్టారు.

Written By: Dharma, Updated On : November 7, 2024 7:36 am

Donald Trump(10)

Follow us on

Donald Trump: ఇన్ని అవాంతరాలను ట్రంప్ దాటాడు. అమెరికా అధ్యక్షుడయ్యాడు. తను అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చెప్పాడు. అతడు చెప్పిన మాటలను అమెరికా నమ్మింది. అందువల్లే అధ్యక్ష ఎన్నికల్లో అతన్ని గెలిపించింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అనే పిలుపును అందుకుని.. ఎన్నికల్లో ఓటు వేసి ట్రంప్ ను అధ్యక్షుడిని చేసింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో ఆయనపై పెద్దల చిత్రాలలో నటించే ఓ నటి తీవ్ర ఆరోపణలు చేసింది..” నన్ను శారీరకంగా హింసించాడు. ఆరోజు రాత్రి అతనితో గడిపాను. ట్రంప్ నన్ను ప్రైవేట్ గా కలిశాడు. ఆ రాత్రి ఇద్దరం ఏకాంతంగా గడిపామని” ఆ పెద్దల చిత్రాల నటి సంచలన ఆరోపణలు చేసింది. ఆ నటి చేసిన ట్రంప్ ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసాయి. ఆ తర్వాత ట్రంప్ వాటి నుంచి ధైర్యంగా బయటపడ్డారు.

చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చారు

అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జూలై నెలలో ట్రంప్ పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దుండగుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. అతడి తుపాకీ నుంచి వెలువడిన తూటా ట్రంప్ చెవిని తాకితూ వెళ్ళింది. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డాడు. అతడి చెవి నుంచి రక్తం వచ్చింది. వెంటనే అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ పోలీసులు ట్రంప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఘటన ట్రంప్ పై అమెరికా ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ట్రంప్ ఓ గోల్ఫ్ కోర్టు లో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు. అప్పుడు కూడా ట్రంప్ త్రుటి లో తప్పించుకున్నారు. అయితే ఈ కారణాలను చూసి ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అనేక రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ ట్రంప్ వెనుకడుగు వేయలేదు. రిపబ్లికన్ పార్టీని ఒప్పించి.. అతడు అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. అనేక కష్టాలు ఎదుర్కొని విజేతగా ఆవిర్భవించాడు. ఎన్నికల ప్రచారంలో కమలపై ప్రతి సందర్భంలోనూ ట్రంప్ పై చేయి సాధించారు. అంతేకాదు డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను గణాంకాలతో సహా వివరించారు. అది సహజంగానే అమెరికన్లను ఆలోచింపజేసింది. అందువల్లే వారు కమలవైపు మొగ్గు చూపించకుండా.. ట్రంప్ కు జై కొట్టారు. దీంతో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యారు.. మొత్తంగా అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎన్నికల ముందు అమెరికన్ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చుతామని ఇప్పటికే ట్రంప్ ప్రతినిధి ప్రకటించారు. అమెరికా అభివృద్దే లక్ష్యంగా బలమైన నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.