Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సుకర్మ యోగం కారణంగా కొన్ని రాశులపై సూర్యదేవుని అనుగ్రహం ఉండనుంది. దీంతో వారి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. మరికొన్ని రాశుల వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. మేషం నుంచి మీనం వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఈ రోజు ఈ రాశివారు ఉల్లాసంగా ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో వీరికి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి.
వృషభ రాశి:
కొందు శత్రువులు మీ పనులకు ఆటంకాలు సృష్టిస్తారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. డబ్బు సంబంధిత లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండాలి.
మిథున రాశి:
వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తప్పడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమరితనాన్ని వీడాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి:
ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా.. అందులో విజయం సాధిస్తారు.
సింహారాశి:
ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కష్టపడిన వారికి ఫలితం ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా ఆందోళన చెందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో దృష్టి పెడుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కన్య రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. మధ్యాహ్నం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి:
శుభకార్యక్రామల్లో ఎక్కువగా పాల్గొంటారు. ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అశాంతి ఏర్పడితే దానిని సరిచేయడానికి కష్టపడుతారు. మనసులో వ్యతిరేక ఆలోచనలు వస్తాయి.
వృశ్చిక రాశి:
ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పెద్దల నుంచి సహకారం పొందుతారు. ఇంటి నిర్మాణం కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి:
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. ఆర్థికంగా చిక్కులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
కష్టపడి పనిచేసినా కొన్ని పనులు పూర్తి కావు. గతంలో చేసిన పనులకు చింతించాల్సి వస్తుంది.వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కుంభరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని ప్రమాదకర పనులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. డబ్బు పొదుపు చేయడంలో శ్రద్ధ తీసుకుంటారు.
మీనరాశి:
వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.