Wife and Husband : భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది. భాగస్వామిని అర్ధం చేసుకుని జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలి. ఎలాంటి బంధం అయినా కొన్ని విషయాలు మాత్రమే పట్టించుకోవాలి. భాగస్వామి చేసిన ప్రతి పనిలో తప్పులు వెతకాకూడదు. అప్పుడే బంధం బలపడుతుంది. ఈరోజుల్లో రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే.. చిన్న విషయానికి కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న గొడవలు పెద్దవి అయి చివరకు విడిపోయే వరకు వస్తుంది. భార్యాభర్తల బంధం అనేది ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య వేరే వాళ్లకి చోటు ఇవ్వకూడదు. వేరే వాళ్లకి అంటే కేవలం మనుషులకు మాత్రమే కాకుండా.. కొంత ప్రవర్తనను కూడా ఇద్దరి మధ్యలో చోటు ఇవ్వకూడదు. మరి అవేంటో చూద్దాం.
మీ పార్టనర్ ను వేరే వాళ్లతో పోల్చడం
చాలా మంది వాళ్ల భాగస్వామని ఇతరులతో పోల్చుతారు. ఆమెని చూసి నేర్చుకో, అతన్ని చూసి నేర్చుకో అని సందర్భాన్ని బట్టి అంటుంటారు. ఇలా ఇతరులతో పోల్చడం వాళ్ల ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పార్టనర్ ను వేరే వాళ్లతో పోల్చువద్దు.
ఈర్ష్య భావంతో ఉండవద్దు
భార్యాభర్తల్లో ఒకరు గెలిస్తే.. ఇద్దరిలో ఎవరో ఒకరు జెలసీగా ఫీల్ అవుతారు. ఉదాహరణకి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే.. అందులో ఒకరికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ బంధంలో ఒకరికి ఈర్ష్య పెరిగి.. గొడవలు మొదలు అవుతాయి. కాబట్టి ఇలాంటి వాటికి అసలు చోటు ఇవ్వకండి.
అనుమానంతో వద్దు
భాగస్వామి అబద్దం చెప్పారని కొందరు అనుమానిస్తుంటారు. ఒకసారి అలా చేసారని.. ప్రతిసారి అలాగే చేస్తారని కొందరు చిన్న విషయాలకి కూడా అనుమానిస్తారు. ఒక్కసారి ఫోన్ బిజీ వచ్చిన సరే.. అనుమానించడం మొదలు పెడతారు. వీటి వాళ్ల ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. అనుమానంతో భాగ్యస్వామిని ఎప్పుడు నిందిస్తుంటారు. ఇది బంధానికి అంత మంచిది కాదు.
ఎక్కువగా ఆశించవద్దు
ఏ రిలేషన్ లో అయిన ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇవి ఉంటే తప్పకుండా బంధంలో గొడవలు వస్తాయి. ఎందుకు అంటే మనం భాగస్వామి నుంచి ఆశిస్తాం. ఒకవేళ భాగస్వామి మనం ఆశించినది చేయకపోతే.. ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. దూరం పెరుగుతుంది. అలా విడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పార్టనర్ నుంచి ఎలాంటివి ఆశించవద్దు. వాళ్లకి నచ్చినట్టు ఉండమని చెప్పండి.
చులకన చేయవద్దు
చాలామంది వాళ్ల భాగస్వామిని చులకనగా చూస్తుంటారు. ఏ విషయంలో అయిన చేయడం రాదని అనడంతో పాటు.. మంచి చేసిన ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరు. ఎప్పుడైనా భాగస్వామి గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే బంధం ఇంకా బలపడుతుంది. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉన్నప్పుడే ప్రేమ కూడా పెరుగుతుంది. లేకపోతే గొడవలు వస్తాయి. కాబట్టి భాగస్వామిని అర్ధం చేసుకుని.. వీటికి చోటు ఇవ్వకుండా సంతోషంగా ఉండండి.