https://oktelugu.com/

Horoscope Today: ఈ నాలుగు రాశుల వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక ధనయోగం..

ఈ రాశి వారికి ఈ రోజు శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు సంబంధించి తీసుకొని నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2024 / 07:45 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుహ్యంగా లాభాలు ఉండానున్నాయి. మరికొన్ని రాశుల వారు అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగులకు పనివారం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కుటుంబ సభ్యుల సలహాతో వ్యాపారాలు ముందుకు సాగాలి. కొన్ని అవసరాలు తీర్చడానికి స్నేహితులు ముందుకు వస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయవంతంగా పూర్తి చేస్తారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : తోటి వారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అదనంగా ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు నష్టాలు ఎక్కువే కానీ కొన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర):
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు నిర్ణయించుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తకోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇదే మంచి సమయం.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) :
    శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు తెలివితేటలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇతరులు అనవసరంగా రెచ్చగొట్టే మాటలను వదిలిన ఈ రాశి వారు అదుపు తప్పకుండా ఉండాలి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే కొన్ని పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో తొందరపడకుండా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైన వాదనలను చేయకుండా ఉండాలి. కొత్త పరిచయాలు వ్యాపారులకు లభిస్తాయి.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేపడుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు .

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఒత్తిడి ఉన్న కొన్ని పనులు పూర్తి చేయడంతో విజయం సాధిస్తారు. ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల గురించి బిజీ అవుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఇవి లాభాలను తెచ్చి పెడతాయి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :
    చుట్టూ వాతావరణం శాంతంగా ఉంటుంది. బంధువులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల కెరీర్ గురించి కీలక విషయం చర్చిస్తారు. వ్యాపార నిమిత్తం కొన్ని ప్రయాణాలు ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడిలు పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాల్లో చాకచక్యంగా ఉండాలి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు సంబంధించి తీసుకొని నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : పెండింగ్ పనులలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పదోన్నతి పొందే అవకాశం. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి.