Ram Charan and Balayya Babu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో 10 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. దీంతో ఎక్కడ చూసిన ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం గురించే చర్చ నడుస్తుంది. రీసెంట్ గానే విజయవాడ లో రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల భారీ కటౌట్ ని ఆవిష్కరించి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. నేషనల్ మీడియా కూడా దీనిపై ప్రత్యేకంగా కవరేజ్ ఇచ్చింది. అభిమానులు రామ్ చరణ్ మీద చూపిస్తున్న ప్రేమపై ప్రశంసల వర్షం కురిపించారు. కటౌట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా, హెలికాఫ్టర్ నుండి ఆ కటౌట్ పై పూల వర్షం కురిపించడం. ఈ ఈవెంట్ కి పది వేల మందికి పైగా అభిమానులు హాజరు కావడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. అయితే నేడు ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.
ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ రామ్ చరణ్ కటౌట్ గురించి ప్రస్తావించబోతున్నాడట. ప్రపంచం లోనే అత్యంత భారీ కటౌట్ నీదే అంటగా అనే ప్రశ్న వేయబోతున్నారట. ఆ తర్వాత దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ 1986 వ సంవత్సరం లో విడుదలైన ‘దేశోద్ధారకుడు’ చిత్రానికి నా అభిమానులు కూడా 106 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు. అప్పటికి అదే ఆల్ టైం రికార్డు. ప్రయత్నం చేసి ఉంటే ప్రపంచ రికార్డ్స్ లోకి అది కూడా ఎక్కేది అని చెప్పబోతున్నాడట. అన్ స్టాపబుల్ షో మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అనే విషయం తెలిసిందే. BVS రవి ప్రతీ ఎపిసోడ్ కి స్క్రిప్ట్ ని అందిస్తాడు. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకప్పుడు ప్రతీ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తాడు. ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే దాని మీద బాలయ్య బాబు ముందుగానే ప్రాక్టీస్ చేస్తాడు.
అదే విధంగా గెస్ట్ కూడా దీనిపై ప్రాక్టీస్ చేస్తాడు. ఒక్క పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రమే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా జరిగింది. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే దానిపై కాస్త వర్క్ చేసాడు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా వచ్చేసాడు. ఇకపోతే నేడు షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ని వచ్చే నెల మొదటి వారం లో ఆహా మీడియాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రోమో ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. మొదటి నుండి రామ్ చరణ్, బాలయ్య బాబు కి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య బాబు కి రామ్ చరణ్ మీద జోకులు, సెటైర్లు వేసేంత చనువు ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎపిసోడ్ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఆ రేంజ్ లో ఉండబోతుందా లేదా అనేది.