Countries : మన ఇల్లు నీట్ గా ఉంటే ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఊరు నీట్ గా ఉంటే ఊరి ప్రజలు, దేశం నీట్ గా ఉంటే మొత్తం దేశ ప్రజలే నీట్ గా ఉంటారు. అయితే దీనికి చాలా సంకల్పం కావాలి. ప్రభుత్వాలు కృషి చేసినా సరే ప్రజలు అనుకుంటే మాత్రమే ఏ ప్రాంతం అయినా సరే నీట్ గా ఉంటుంది. మరి మన ప్రపంచంలో పూర్తి నీట్ గా ఉండే దేశాలు ఏంటో మీకు తెలుసా? ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక ప్రకారం, పరిశుభ్రతకు సంబంధించి దేశాలకు ర్యాంక్ ఇవ్వడానికి పర్యావరణ పనితీరు సూచిక (EPI) ఉపయోగిస్తారు. మరి ఈ సారి ఏ దేశాలు నీట్ విషయంలో టాప్ ర్యాంకును సాధించాయో చూసేద్దామా?.
దేశాలను ర్యాంక్ చేయడానికి 11 వర్గాలలో 40 పనితీరు సూచికలు ఉపయోగిస్తారు. అధిక EPI స్కోర్ అనేది ఇతర దేశాల కంటే క్లీనర్‌గా ఉన్న దేశం అని అర్థం. అందులో మొదటిది డెన్మార్క్.
డెన్మార్క్: మొత్తం EPI స్కోరు 77.9తో, డెన్మార్క్ అత్యంత పరిశుభ్రమైన, అత్యంత పర్యావరణ అనుకూల దేశంగా పేరు గాంచింది. పశువుల ఉత్పత్తి నుంచి గ్రీన్హౌస్ వాయువు (GHG) ఉద్గారాలపై పన్ను విధిస్తుంది ఈ దేశం. ప్రకృతిని పునరుద్ధరించి, నత్రజని కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.
యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 77.7 EPI స్కోర్‌తో UK జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఇది సామిటేషన్, మద్యపానం, కాలుష్యంపై ఎక్కువ ధరలను విధిస్తుంది. అదే సమయంలో వాతావరణం, పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి దేశం ఎన్నో ప్రయత్నాలను చేసింది. ఇప్పుడు కూడా మరింత ప్రయత్నాలు చేస్తుంది.
ఫిన్లాండ్ పారిశుద్ధ్యం, తాగునీరు, భారీ లోహాల బహిర్గతం కోసం ఖచ్చితమైన స్కోర్‌ను సాధించిన ఫిన్లాండ్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇది కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఫిన్లాండ్‌లో, వాయు కాలుష్యంతో ప్రతి సంవత్సరం 1500-2000 మంది మరణిస్తున్నారు. అయితే ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.
మాల్టా అనేకమందిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ దేశం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రధానంగా తాగునీరు, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల కోసం ఖచ్చితమైన స్కోర్‌లతో ఈ లిస్ట్ లో నిలిచింది. ఈ దేశం కూడా చాలా నీట్ గా ఉంటుంది. స్వీడన్ CO2 ఉద్గారాలను తగ్గించడానికి, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం విస్తృతమైన పని కారణంగా నార్డిక్ దేశం 72.7 EPI స్కోర్‌ను కలిగి ఉంది. ఈ దేశం దీని పట్ల చాలా కట్టుబడి పని చేస్తుంది. అదే విధంగా లక్సెంబర్గ్ 72.3 EPI స్కోర్‌తో, 640,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న చిన్న దేశం. అయితే పరిశుభ్రమైన దేశాల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.