Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 7న ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. బుధవారం చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మరో రాశి వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
నిరుగ్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. అయితే అతి విశ్వాసం తో అనర్థాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి.
వృషభ రాశి:
వివాహ చేసుకోవాలనుకునేవారికి ప్రతిపాదనలు రావొచ్చు. ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కొన్ని పనుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మిథునం:
వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం. భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
వివాహితులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రంగాల వారికి సానుకూల వాతావరణం.
సింహ:
దంపతుల మధ్య మనస్పర్థలు వస్తాయి. విదేశాల నుంచి బంధువుల వచ్చి కలుస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దుత పెరుగుతుంది.
కన్య:
కొత్త పనులు మొదలుపెడుతారు. వ్యాపారులు శత్రువల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో కొత్త ప్రతిపాదనలు రావొచ్చు.
తుల:
ఆస్తికి సంబంధించిన కొత్త సమాచారం అందుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతావరణం. పోటీ పరీక్ష్లల్లో పాల్గొనే వారికి అనుకూల వాతావరణం.
వృశ్చికం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. వివాహితుల జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ధనస్సు:
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో మనస్పర్థలు వస్తాయి.
మకర:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. జీవిత భాగస్వామి కోసం కష్టపడుతారు. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభం:
దూర ప్రయాణాలు చేస్తారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.
మీనం:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకూల వాతావరణం. వివాహితులు సంతోషంగా గడుపుతారు. వివిధ రంగాల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.