Hyderabad Student : అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ తెలుగు విద్యార్థిపై పాశవిక దాడి చేసింది. అమెరికాలోని చికాగోలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిపై అతడి ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడి చేసి గాయపరిచారు. విద్యార్థిని దొంగలు తీవ్రంగా గాయపరిచి అతడి ఫోన్ లాక్కెళ్లారు. విపరీతంగా రక్తస్రావంతో అతడు సృహ తప్పి పడిపోయినట్టు అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు శవమై కనిపించిన నేపథ్యంలో ఈ దాడి తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో అలీని అతని ముగ్గురు దొంగలు వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.. అతని నుదిటి, ముక్కు , నోటి నుంచి రక్తం కారుతూ పరిగెడుతున్న అలీ వీడియో రికార్డ్ అయ్యింది. “నలుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు. నేను నా చేతిలో ఆహార ప్యాకెట్‌తో ఇంటికి తిరిగి వస్తున్నాను. నేను నా ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులు పట్టుకొని తన్నారు. కొట్టారు. నాకు సహాయం చేయాలని అరిచినా ఎవరూ రాలేదు.’ అని అతడు వాపోయాడు.
గత వారం ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనే విద్యార్థి శవమై కనిపించాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ అతను అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. ఈ కేసులో అక్రమాలకు తావులేదని అధికారులు తేల్చిచెప్పారు. అదే వారం ప్రారంభంలో, పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయాడు. యూనివర్శిటీ క్యాంపస్‌లో ఆచార్య మృతదేహం కనుగొనబడింది. అతను తప్పిపోయినట్లు అతని తల్లి నివేదించిన కొన్ని గంటల తర్వాత శవమై కనిపించడం గమనార్హం..
హర్యానాకు చెందిన వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి చేతిలో కొట్టి చంపబడ్డాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు. ఇలా వరుసగా భారతీయ విద్యార్థులపై దాడులు, హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇవి జ్యాతహంకార దాడులా? లేదా డబ్బు , ఇతర కక్షసాధింపులతో చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.